బ‌న్నీ-చ‌ర‌ణ్ కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్ సినిమా ..?

Suma Kallamadi
ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క పెద్ద హీరో మ‌ల్టీస్టార‌ర్ వైపు మొగ్గు చూపుతున్నాడు. మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో ఉండే మ‌జా వారికి అర్థ‌మైంది. మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు అన‌గానే పెద్ద హీరోలు త‌డ‌బాటు లేకుండా ఒప్పేసుకుంటున్నారు. పాత సినిమాల్లో ప్ర‌తి సినిమా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలుగా రూపొందేవి. అవి ఖ‌చ్చితంగా విజ‌యవంత‌మ‌య్యేవి. మ‌ళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే టాలీవుడ్ క్రేజీ కాంబోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అలాగే రానా కాంబినేష‌న్ లో భారీ ప్రాజెక్టు భీమ్లా నాయక్ మూవీ రూపొందుతోంది. కాగా అటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అఆగే జూనియ‌ర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల కాంబినేష‌న్‌లో ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఇక తండ్రి కొడుకులు అయిన కింగ్ నాగార్జునతో పాటు నాగచైతన్య క‌లిసి బంగార్రాజు మూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఇంకోవైపు క్రేజీ కాంబోగా మహేష్ బాబు అలాగే రౌడీ విజ‌య్ దేవరకొండ క‌లిసి ఓ మల్టీస్టారర్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

ఇక బాలీవుడ్‌లో సైతం అమీర్‌ఖాన్ తో పాటు నాగచైతన్య లాంటి హీరోలు కూడా న‌టిస్తున్న కూమల్టీస్టారర్ మూవీపై చాలానే అంద‌రి దృష్టి ఉంద‌ని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇదే అదే త‌ర‌|హాలో మ‌రో క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్క‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా మగధీర మూవీతో రామ్ చరణ్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసేసిన స్టార్ డైరెక్ట‌ర్ రాజమౌళి కోసం గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ అధినేత అయిన‌ అల్లు అరవింద్ త‌న కొడుకు బ‌న్నీతో ఓసినిమాను రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో చేయాల‌ని ఎంత‌గానో ప్ర‌య‌త్నం చేసినా చివ‌ర‌కు అది కుద‌ర‌లేదు. కాగా ఇప్పుడు ఆయ‌న దానిని ప‌క్క‌న పెట్టి మ‌రీ రాజమౌళి డైరెక్ష‌న్ లోనే బ‌న్నీతో పాటు రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ భారీ సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌టా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్. కాగా మ‌రి రాజమౌళి దీనికి ఓకే చెబుతారా లేదా అన్నది  మాత్రం కొంచెం స‌స్పెన్స్ గా మారింది. ఇంకొన్ని రోజులు గడిస్తే గానీ ఈ స‌స్పెన్స్ పై తెర దిగ‌ద‌ని తెలుస్తోంది. కాగా రాజ‌మౌళి ఖాతాలో ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్ రెడీగానే ఉంది. మ‌రి అది పూర్తి అయిన త‌ర్వాత అయినా బ‌న్నీ-చ‌ర‌ణ్  లాంటి మ‌ల్టీస్టార‌ర్ సినిమాను ఎప్పుడు సెట్ చేస్తాడో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే చరణ్  అలాగే బన్ని కలిసి ఎవరు అనే మూవీలో చేశారు. ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి తీయ‌గా మంచి హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: