తొలిప్రేమ.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన సినిమా?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ అన్నది ఎన్నో మరపురాని జ్ఞాపకాల ఇస్తూ ఉంటుంది.  అయితే ఇక తొలిప్రేమ ప్రతి ఒక్కరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.  ఇలా తొలి ప్రేమలోని జ్ఞాపకాలు అన్నింటిని ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తూ సెంటిమెంట్ డైలాగ్ లతో..  మదిని కదిలించిన సినిమా తొలిప్రేమ.  వరుణ్ తేజ్ రాశి కన్నా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ రాశి ఖన్నా మధ్య సాగిపోయే లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయిపోయింది.

 ముఖ్యంగా యూత్ అందరికీ కూడా తొలిప్రేమ జ్ఞాపకాలను మరోసారి మరో సారి నెమరు వేసుకునేలా చేసింది.  ఇలా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని సూపర్ హిట్ సాధించింది ఈ సినిమా.  కాలేజీ లో ప్రారంభమైన వీరి ప్రేమ కథ చివరికి ఒక చిన్న కారణంతో విడిపోతుంది.  ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ దూరంగానే ఉంటారు.  కానీ ఆ తర్వాత ఒకానొక సమయంలో అనుకోకుండా కలుస్తారు. ఆ సమయంలో వారి తొలి ప్రేమ జ్ఞాపకాలు మళ్లీ చిగురిస్తాయి.  ఇలాంటి సమయంలోనే దర్శకుడు కొన్ని సెంటీమెంట్ డైలాగులతో సినిమాను ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు.

 జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా..  ఎప్పుడూ మనతోనే ఉంటాయి అంటూ ఇక దర్శకుడు హీరోతో చెప్పించిన డైలాగులు ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని తాకాయి.  ఇక ఈ సినిమాలోని ప్రతి పాట కూడా సినిమాకి ప్రాణం పోసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇలా తొలిప్రేమ సినిమా నిజంగానే ప్రతి ఒక్కరికి తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసింది.  ఇలా అద్భుతమైన లవ్ స్టోరి తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని అదరిపోయే హిట్ కొట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: