అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళం సినిమా 'ప్రేమమ్' తో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ బ్యూటీకి మలయాళం తో సహా ఇతర భాషల నుండి కూడా అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఆ' సినిమాలో సమంత తో పాటు రెండో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అనుపమ ఓ పల్లెటూరి అమ్మాయిల, లంగా ఓని లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా ఉన్నది ఒకటే జిందగీ హలో, గురు ప్రేమకోసమే , శతమానంభవతి , వంటి సినిమాలలో నటించి తెలుగులో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న '13 పేజీస్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటుంది. తను రోజు చేసే పనులను తన ఆక్టివిటీస్ ను మరియు తన షూటింగ్ అప్ డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇది మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తను అందంగా కనిపించే ఫోటోలను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనుపమ నలుపు రంగు టీ షర్ట్ ధరించి మెడలో ఒక లాకెట్ వేసుకుని కొంటెగా చూస్తుంది. ప్రస్తుతం అనుపమకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.