ఏమాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో సమంత మాయలో పడిపోయాడు అక్కినేని కుర్రాడు నాగచైతన్య. ఈ సినిమా టాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడమే కాకుండా నిజ జీవితంలోనూ ఇద్దరి మధ్య కూడా మంచి కెమిస్ట్రీ ఉండటంతో ఒకరి మాయలో మరొకరు పడిపోయారు. అలా ఒకరి ప్రేమలో మరొకరు దాదాపు ఏడేళ్లపాటు విహరించారు.ఆ తరవాత చైతన్య తన కుటుంబ సభ్యులను ఒప్పించారట. ఆ తరవాత సమంత కూడా తన కుటుంబ సభ్యులను ఒప్పించింది. నాగార్జున టాలీవుడ్ లో బడా హీరో కావడం...నాగ చైతన్య కూడా టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు ఉండటంతో సామ్ కుటుంబ సభ్యులు కూడా చైతూతో పెళ్లికి ఓకే చెప్పారు.
ఇక పెళ్లి తరవాత కూడా నాగచైతన్య, సమంత సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అంతే కాకుండా కలిసి సినిమాలు చేస్తూ హిట్ లు కూడా కొడుతున్నారు. అలా టాలీవుడ్ లో సమంత నాగచైతన్య జంటకు ఎంతో మంది అభిమానులయ్యారు. అయితే సమంత తన సోషల్ మీడియాలో తన పేరు ముందు చైతూ ఇంటిపేరు అక్కినేనిని తొలగించడంతో సమంత చైతూ మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. నిజానికి సమంత ఏ కారణం వల్ల తన సోషల్ మీడియా నుండి పేరును మార్చుకుందో తెలీదు.
కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు రాసేసుకున్నారు. అయితే దానిపై ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో సమంతను ప్రశ్నించగా..అది నా పర్సనల్ అని తనకు చెప్పడం ఇష్టం లేదనిసమాధానం ఇచ్చింది. దాంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ సమంతకు చైతూతో ఎలాంటి మనస్పర్ధలు లేవని ఒక్క ట్వీట్ తో అర్థమైపోయింది. నేడు కింగ్ నాగార్జున పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సంధర్భంగా సెలబ్రెటీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా సమంత కూడా తన మామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి తమ ఫ్యామిలీ లో ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చింది. మీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. ఎల్లప్పుడు మీరు ఆయిరారోగ్యాలతో ఉండాలి...నాగార్జున మామ అంటూ సమంత ట్వీట్ చేసింది.