ఏ ఎన్ ఆర్ చనిపోయే ముందు అంత కష్టపడ్డారా...?

murali krishna
అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి అస్సలు తెలియని వారే ఉండరు. అద్భుతమైన పాత్రలని చేసి అందరితో శబాష్ అనిపించుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడుగా మరియు నిర్మాతగా పేరు పొందారు..మొట్టమొదట ఆయన వరి పొలం నుండి, నాటకరంగం ద్వారా కళారంగం లోకి వచ్చిన వ్యక్తని సమాచారం. తెలుగు సినిమా తొలినాళ్ళలో అగ్ర కథానాయకులలో ఒకడు ఏ ఎన్ ఆర్. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ఎంతో ప్రాముఖ్యత పొందాడట. ఇది ఇలా ఉంటే ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితం మొదలైనట్లు సమాచారం.

అప్పటి నుండి రకరకాల చిత్రాలతో తెలుగు మరియు తమిళ సిని పరిశ్రమలలో 75 సంవత్సరాల పైగా నటించాడని సమాచారం. ఎన్టీఆర్ తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా నిలబడ్డారు నాగేశ్వరావుగారు. అయితే నాగేశ్వరావు నటన ఎంత అత్యద్భుతం అంటే మూడుసార్లు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడని సమాచారం. ఇండియన్ సిని రంగంలో ఆయన చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ అతి పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ తో పాటు ఇండియన్ సినీ రంగం లో జీవిత సాఫల్య పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారట.

అయితే నాగేశ్వర రావు గారి గురించి కాదంబరి కిరణ్ మాట్లాడి ఎన్నో ముఖ్యమైన విషయాలని పంచుకున్నారని సమాచారం. నాగేశ్వరావు గారితో హోటల్ లో వున్నప్పుడు కమల్ హాసన్ గారి తో పరిచయం అయ్యిందని ఆ విషయం మాట్లాడటం మొదలు పెట్టడం జరిగిందట. ఇదిలా ఉంటే తన పాత్రలు గురించి డబ్బింగ్ కెరీర్ గురించి కూడా ఇంటర్వ్యూ లో చెప్పాడని సమాచారం. నాగేశ్వర రావు గారు తన జీవితంలో ఉండడం వలన తనకి చాలా మంచి జరిగిందని చెప్పాడట. చివర రోజుల్లో కూడా నాగేశ్వర రావు గారి దగ్గర వున్నానని అన్నారట. అయన కాలు ఇలా అంటే చర్మం వచ్చేదని చెప్పారట. పైగా ఎంతో బాధ పడ్డారని తెలిపారు. అప్పుడు కూడా నేను అక్కడే వున్నాను అని కాదంబరి కిరణ్ చెప్పాడని సమాచారం. క్యాన్సర్ వచ్చింది అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు నాగేశ్వర రావు గారు . అంత ధైర్యం ఉన్న మనిషి ఆయన అని చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Anr

సంబంధిత వార్తలు: