నాగబాబు అల్లు అరవింద్ ల మధ్య వివాదం... కారణం అదేనా ?

VAMSI
టాలీవుడ్ లో ముఖ్యంగా మెగా, నందమూరి, దగ్గుబాటి మరియు అక్కినేని ఫ్యామిలీలు తెలుగు సినిమా పరిశ్రమను శాసిస్తున్నాయి అన్న నానుడి  ఇంకా తెలుగు ప్రేక్షకుల మనసులో ఉంది. కానీ వాస్తవానికి ఏ ఫ్యామిలీ కూడా సినిమా పరిశ్రమను రూల్ చేయడం  వీలు కాదు. టాలెంట్ ఉంటే ఎవ్వరికైనా అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మెగా హీరో అయినా, నందమూరి హీరో అయినా అవకాశం ఒక్కసారే వస్తుంది. దానిని పూర్తిగా ఉపయోగించుకుంటేనే వారికి మళ్లీ కెరీర్ ఉంటుంది, లేదంటే పాతాళానికి పడిపోవాల్సిందే. ఇది అసలైన అక్షర సత్యం. ఇది చాలా సార్లు రుజువయింది కూడా. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఒక చిన్న సమస్యగా మొదలై ఎది పెనుభూతంగా మారేలా ఉందని తెలుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, మెగా బ్రదర్స్ ముగ్గురిలో నాగబాబు హీరోగా సెటిల్ కాలేక పోయాడు. దీనికి పలు కారణాలు ఉన్నా అది నిజం.  


ఆ తర్వాత సహా నటుడిగా వివిధ పాత్రలను పోషిస్తూ ముందుకు పోతున్నాడు. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరంజ్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. కానీ సినిమా బాగున్నా ఎందుకో తెలుగు ప్రేక్షకులకు రుచించలేదు. సైట్ చేస్తే భారీ నష్టాలు మిగిల్చి నాగబాబును రోడ్డున పడేలా చేసింది. ఆ తర్వాత మళ్లీ నిర్మాణం వైపు చూడనే లేదు. ఇక ఆ తర్వాత కాలక్రమేణా ఆర్థిక ఇబ్బందుల నుండి మెల్ల మెల్లగా బయటపడ్డారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా మారి తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల హృదయాల్లో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇలా మళ్లీ నాగబాబు ఫ్యామిలీ బాగా సెటిలయ్యారు.  అయితే ఇప్పుడు మళ్లీ నాగబాబుకు నిర్మాణ రంగంపై ఆశ పుట్టిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వరుస హిట్ లతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ మరియు అల్లు అర్జున్ లతో సినిమా తీయాలని ట్రై చేస్తున్నాడట.


కానీ ఇందుకు నిర్మాత మరియు బావ అయిన అల్లు అరవింద్ అడ్డు పడుతున్నాడని సమాచారం. దీని కారణంగా నాగబాబుకు మరియు అల్లు అరవింద్ కి అభిప్రాయబేధాలు వచ్చే లాగా ఉన్నాయని సినీ వీధుల్లో టాక్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే నిర్మాతగా ఉన్న రామ్ చరణ్ నాన్నతో వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ అల్లు అరవింద్ ఉద్దేశ్యం ఏమిటంటే...ఒకసారి నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న తర్వాత మళ్లీ ఎందుకు అంటున్నట్లు తెలుస్తోంది.  మరి ఈ విషయంలో నాగబాబు వెనక్కు తగ్గుతాడా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు. మరి ఇందులో చిరంజీవి జోక్యం చేసుకున్నారా ? ఎవరికి సపోర్ట్ చేశారన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: