మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరు.. ఈ సినిమా అనంతరం లూసిఫర్ రిమేక్ తో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధింది అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో చిరుని ఢీ కొట్టే విలన్ పాత్రలో ఓ సీనియర్ నటుడు జగపతిబాబు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి గత సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమాలో జగపతిబాబు వీరారెడ్డి పాత్రను పోషించారు.నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో జగపతిబాబు మంచి నటనను కనబర్చాడు.ఇక ఇప్పుడు మరోసారి చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో జగపతిబాబు కి ఛాన్స్ దక్కిందని ఇండ్రస్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అంతేకాదు ఈ సినిమాలో విలన్ పాత్రకి స్పెషల్ మేనరిజం కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక త్వరలోనే జగపతిబాబు పాత్రకి సంబంధించి త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరుని పూర్తి మాస్ పాత్రలో చూపించబోతున్నాడట. ఇక రవితేజ నటించిన పవర్ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన బాబీ..ఆ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మరోవైపు ఈ సినిమా దర్శకుడు బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని కావడంతో తన అభిమాన హీరో చిరంజీవిని ఈ విధంగా చూపిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు...!!