రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఊచకోత...

VAMSI
" data-original-embed="" >

ఈ రోజు మొదలైన "ఎవరు మీలో కోటీశ్వరులు" షో కి ఎనలేని స్పందన వస్తోంది. మొదటి ఎపిసోడ్ రామ్ చరణ్ తో ప్లాన్ చేయడం బాగా వర్క్ ఔట్ అయిందని చెప్పాలి. ఈ షో లో ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కు రామ్ చరణ్ రావడం అటు "ఆర్ ఆర్ ఆర్" సినిమాకు ప్రమోషన్ గా ఉపయోగపడుతుందని సినిమా బృందం బావించినట్లుంది. రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఒక షో కోసం రావడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ షో మొదటి ఎపిసోడ్ ఈ రోజు ఱాతి 8.30 గంటలకు ప్రారంభం అయి 9.30 గంటలకు ముగిసింది. ఒక గంట పాటు సాగిన ఈ షోలో ఆర్ ఆర్ ఆర్ గురించి పైపైనే కొన్ని హింట్స్ ఇచ్చారు ఇద్దరు నటులు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.

ఈ సినిమా గురించి డెప్త్ గా ఏ విషయాలు చెప్పకపోయినా ఈ సినిమా చేయడం మా అదృష్టమని ఇద్దరూ చెప్పడం గొప్ప విషయం. అంతే కాకుండా తెలంగాణాలో కొమరం భీమ్ పేరు మీద ఏర్పాటు చేసిన ఒక జిల్లా గురించి కూడా ప్రస్తావించారు. దీనితో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరగడంతో పాటు అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ షో గురించి మరియు ఎక్కువగా రామ్ చరణ్ గురించి సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్ లో హంగామా మొదలయింది. రామ్ చరణ్ అభిమానులు అంతా కలిసి ట్విట్టర్ లో చాలా కాలం తర్వాత టీవీ షో ద్వారా రామ్ చరణ్ కనబడడంతో ఈ సందర్భాన్ని బాగా వాడేసుకుంటున్నారు. ట్విట్టర్ లో "Ramcharan at Emk" అనే ట్యాగ్ పేరుతో వైరల్ అవుతోంది.

ఈ ట్యాగ్ ద్వారా రామ్ చరణ్ ను ట్వీట్ల  వర్షంలో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే 3k వ్యూస్ తో కొనసాగుతోంది. ఇప్పటికే ఎంటర్ టైన్మెంట్ విభాగంలో ట్రెండింగ్ టాప్ లో ఉంది. పొద్దున ట్విట్టర్ లో టాప్ లో కొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ప్రోగ్రామ్ రేపు కూడా కొనసాగుతుందని హింట్ ఇచ్చారు ఎన్టీఆర్.. రేపు రానాతో మాట్లాడనున్నారు. సడెన్ గా షో అయిపోవడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీనితో జెమిని టీవీని ట్రోల్ చేస్తున్నారు. ఇక రేపు ఈ షో ఎలా కొనసాగనుంది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: