వీడియో: రాఖీ రోజున చెల్లెలపై ప్రేమ కురిపించిన చిరు!

Suma Kallamadi
అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు అనగా ఆగస్టు 22న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు రాఖీ పండుగ కావడం మరో విశేషం. దాంతో చిరు ఇంట పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవికి ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఒకరి పేరు విజయదుర్గా కాగా, ఇంకొకరి పేరు మాధవి రావు. విజయదుర్గా సాయి ధరమ్ తేజ్ కి తల్లి అవుతారనే విషయం తెలిసిందే.
తన తోడబుట్టిన సోదరీమణులు అంటే చిరంజీవికి అత్యంత ఇష్టం. ఇద్దరి చెల్లెళ్లను చాలా ప్రాణం గా చూసుకుంటారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా కూడా వారిపై తన ప్రేమను కురిపించి అభిమానుల మనసులను పులకరింప చేస్తున్నారు. చిరు రాఖీ పౌర్ణమి వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో అన్నయ్య చిరంజీవికి రాఖీ కడుతున్న చెల్లెలు విజయదుర్గా, మాధవి రావు లను చూడొచ్చు. అలాగే తమ ముద్దుల అన్నయ్యకు ఈ చెల్లెలు ప్రేమానురాగాలతో స్వీట్ తినిపించడం చూడొచ్చు. చిరు కూడా తన చెల్లెళ్లకు తీపి తినిపించారు. ఈ పవిత్ర దినాన తమ అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు.
"నా చెల్లెలిద్దరితోనే కాదు.. తెలుగింటి ఆడపడుచులందరితో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు" అని చిరంజీవి ఈ వీడియో చివరిలో రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వీడియో చూసిన అభిమానులు అందరూ ఫిదా అవుతున్నారు. అందరితో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం కొందరికే దక్కుతుందని.. వారిలో చిరంజీవి ఒకరిని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా 'గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్‌ను చిరు లూసిఫర్ రీమేక్ కి ఖరారు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు మెహర్‌ రమేశ్‌, చిరు కాంబోలో తెరకెక్కనున్న సినిమాకి ‘భోళా శంకర్‌’ అని టైటిల్‌ ప్రకటించి విషయమూ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: