మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా థియేటర్లో... ఫీలింగ్ ఇదే ?

VAMSI
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచి టాలీవుడ్ ఇండస్ట్రీ విశిష్టతను దేశ నలుమూలలకు విస్తరింపజేసిన నటులలో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖులనే చెప్పొచ్చు. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటేనే మెగాస్టార్ చిరంజీవే అన్నట్టు అంతా మెగా మయం చేశారు చిరు. 40 ప్లస్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్..60 ప్లస్ లో కూడా స్టార్ హీరో గా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న మెగా దిగ్గజం. ఎంత చెప్పినా తనివితీరని ఘన చరిత్ర చిరు సొంతం. ఈయన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్లు, సినీ చరిత్రలో నిలిచిపోయే ఆణిముత్యాలు, రికార్డులు బద్దలు కొట్టాలంటే చిరు సినిమాలే గురి. మెగాస్టార్ నటించిన వందల సినిమాల్లో ఏదో ఒక సినిమా అందరికీ వారు చూసిన తొలి సినిమా అవుతుంది. అప్పుడు ఆ సినిమా అనుభవం వారికి ఓ మధుర జ్ఞాపకం.
అదే విధంగా ఒక జర్నలిస్టుగా నేను మొదట చూసిన చిరు సినిమా, అప్పుడు నా అనుభూతి ఎలా ఉంది అనేది ఇపుడు నా మాటల్లో వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాను. అప్పట్లో నా వయస్సు 17 సంవత్సరాలు...ఆ సమయంలో థియేటర్లో నేను చూసిన మొట్ట మొదటి మెగాస్టార్ చిత్రం జై చిరంజీవ. 2006 లో రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాలో  మొదటి సారి చిరుని వెండి తెరపై చూసిన నేను నిజంగా హీరో అంటే ఇంతటి తేజస్సు , మాటల్లో ఆ గాంభీర్యం ఆ స్టైల్ అంతా చిరులా ఉండాలేమో అనిపించింది. ఈ మూవీలో  చిరు పంచ్ ల టైమింగ్ చూసి తెరపై హాస్యాన్ని పర్ఫెక్ట్ గా పండించి ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించ గలిగే నైజం చిరు సొంతం అనిపించింది. ఎంతో సహజమైన నటన..నిజంగా బట్టీ పట్టిన పంచ్ లలా కాకుండా అప్పటికప్పుడు మాట్లాడుతూ సహజంగా వచ్చిన కామెడీలా అనిపించి మనసులో నుంచి నవ్వుల పూలు విరబూసాయి.

 నిజంగా ఈ సినిమా మొదలైంది మొదలు నిజంగా నవ్వులే నవ్వులు పొట్ట చెక్కలైపోయింది. చిరు హీరోయిజం సూపర్, సెంటిమెంట్ పండించాలంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆ ఫీల్ అనేది ప్రేక్షకుల్లో తెప్పించగలగాలి, ఈ విషయంలో నన్నడిగితే మెగా స్టార్ కు 100 కి 200 మార్కులు వేసేయొచ్చు అని అంటాను. ఇందులో తన మేనకోడలు హత్య జరిగిన తర్వాత చిరు హావభావాలు ఒక ఎస్సెట్ అని చెప్పాలి. ఇక ఫైట్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరు ఫైట్స్ కి బాక్స్ బద్దలవాల్సిందే. ఇలా నా జీవితంలో మొదటి సినిమానే నా మదిలో ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి తన 66 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సుఖంగా సంతోషంగా 100 సంవత్సరాలు జీవించాలని ఆ దేవుని కోరుకుంటున్నాము.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: