పోస్ట్ పోన్ పక్కా .... సమ్మరే దిక్కా .... ??

GVK Writings
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా కె కె సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుండగా సముద్రఖని, శ్రియ శరణ్, అజయ్ దేవగన్ వంటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.

స్వాతంత్రోద్యమానికి ముందు జరిగిన కథగా పలు ఫిక్షనల్ అంశాలు కలగలిపి రాజమౌళి ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. భారీ స్థాయి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వాస్తవానికి గత ఏడాది జులై 30న విడుదల చేయాలని భావించారు, అయితే గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో దానిని ఈ ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. అయితే మధ్యలో కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిపివేయబడడంతో ఇటీవల సినిమాని అక్టోబర్ 13కి వాయిదా వేసింది యూనిట్.

ఇక ప్రస్తుతం మన దేశంలో మళ్ళి కరోనా కేసులు మెల్లగా పెరుగుతూ ఉండడంతో పాటు థర్డ్ వేవ్ భయం కూడా అందరిలో నెలకొని ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తమ సినిమాని విడుదల చేయడం కంటే పక్కాగా మంచి డేట్ చూసుకుని వద్దామని కొద్దిరోజులుగా ఆలోచన చేస్తున్న ఆర్ఆర్ఆర్ యూనిట్ ఫైనల్ గా వచ్చే ఏడాది సమ్మర్ కి తమ సినిమాని రిలీజ్ చేసేలా పక్కాగా ప్లాన్ సిద్ధం చేసిందట. కొద్దిరోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంత మేర విజయం అందుకుంటుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే ....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: