ఆశగా వెళ్లితే.. ఏం చేయకుండా పంపించేశారు..!

NAGARJUNA NAKKA
రకుల్ ప్రీత్ సింగ్ ను దురదృష్టం వెంటాడుతోంది. ఎందులో ఎంట్రీ ఇచ్చినా.. ఆ ప్రయత్నం బెడిసికొడుతోంది. ఇక్కడ రాకపోతే రాకపోయింది, బాలీవుడ్ లో అయినా నెట్టుకొద్దాం అని ముంబయి ఫ్లైట్ ఎక్కేసింది. అక్కడ కూడా ఆ బ్యూటీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సినిమా సినిమాకు ఆమె కెరీర్ డౌన్ అవుతూ పోతోంది. ఏ మాత్రం గుడ్ న్యూస్ వినిపించడం లేదు.  దీంతో రకుల్ బాలీవుడ్‌ కు బైబై చెబుతుందా అనే సందేహం ఆమె అభిమానుల్లో నెలకొంది. అటు రకుల్ కూడా తన సినీ భవిష్యత్ పై ఆందోళన చెందుతోంది.
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి 'మన్మథుడు2' తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఈ సినిమాలో ఓల్డ్‌గా కనిపించిందనే కామెంట్స్‌ వచ్చాక, మేకర్స్‌ రకుల్‌ని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో కెరీర్‌ని కాపాడుకోవడానికి హిందీ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది రకుల్. అక్కడ సపోర్టింగ్‌ రోల్స్, హీరోయిన్ అనే తేడా లేకుండా చాలా సినిమాలకి సంతకం చేసింది. అయితే ఇప్పటివరకు విడుదలయిన వాటిల్లో ఒక్కటి కూడా రకుల్‌కి కలిసిరావడం లేదు.
రకుల్ ప్రీత్‌ సింగ్‌ ఇప్పటివరకు 'అయారి, దే దే ప్యార్ దే, మర్‌జావా, సర్దార్ కా గ్రాండ్ సన్' సినిమాలతో హిందీ ప్రేక్షకుల ముందుకెళ్లింది. అయితే వీటిల్లో 'దే దే ప్యార్ దే' తప్ప మిగిలిన సినిమాలన్నీ రకుల్‌ని నిరాశ పరిచాయి. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన 'సర్దార్‌ కా గ్రాండ్ సన్'కి కూడా మిక్స్‌డ్‌ రెస్పాన్స్ వస్తోంది.
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేతిలో 'ఎటాక్, మేడే, థాంక్ గాడ్, డాక్టర్ జి' లాంటి సినిమాలున్నాయి. వీటిల్లో ఒక రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే గానీ రకుల్‌ బాలీవుడ్‌లో బిజీగా ఉండదు. పొరపాటున ఫ్లాప్ అనే పదం వినిపించినా, రకుల్‌ కెరీర్‌ కష్టాల్లో పడే అవకాశముంది. మరి ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడుతుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: