"భీమ్లా నాయక్" కు ఓటమి భయం పట్టకున్నట్టుందే ?

VAMSI
మలయాళ బ్లాక్ బాస్టర్ మూవీ అయ్యప్పనుమ్ కోషీయం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. తాజాగా ఈ సినిమాకి భీమ్లా నాయక్ అనే టైటిల్ ను ఫైనల్ చేసి ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఒరిజినల్ మలయాళ కథలో మార్పులు చేసి మన నేటివిటీకి తగ్గట్టుగా  తెరకెక్కిస్తున్నారు. అయితే కథలో మార్పు కాస్త కాదని భారీ గానే  మార్పులు జరుగుతున్నాయని తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే. మలయాళంలో  బిజుమీనన్ పోషించిన కోషియమ్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తుండగా, పృథ్వీరాజ్ పోషించిన అయ్యప్పనుమ్ పాత్రలో రానా నటిస్తున్నారు. అయితే మలయాళంలో ఈ ఇరు పాత్రలు నువ్వా ..నేనా అంటూ ఎంతో ఉత్కంఠగా సమాన ప్రాధాన్యంతో సాగుతాయని తెలుస్తోంది.


అయితే మన తెలుగులో మాత్రం వన్ మ్యాన్ షో గా పవన్ కళ్యాణ్ పాత్రకు అధిక ప్రాధాన్యం ఉండేలా మార్పులు జరిగాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ హాఫ్ ఒరిజినల్ మూవీకి లాగే సాగిన  సెకండ్ హాఫ్ లో మాత్రం కథలో భారీ మార్పులు చేస్తున్నారని పవన్ పాత్రపై  ఎక్కువ  ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ పాత్ర ను బాగా హైలెట్ చేసి రానా పాత్రను మాత్రం పరిమితంగానే చూపించనున్నారట. అంటే ఈ సమాచారం ప్రకారం..రానా పాత్ర గెస్ట్ రోల్ గా మాత్రమే ఉండబోతోందని అంటున్నారు. అందుకే ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ లో పవన్ ను మాత్రమే ప్రధానంగా చూపించారు. అయితే టీజర్ పై పలు ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే.


మూవీకి అనుకూలంగా కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని కథను రెఢీ చేసుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు.  డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ విషయంలో కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నారని వినికిడి. వకేల్ సాబ్ లాగా ఒన్ మ్యాన్ షో అని టాక్ రాకుండా ఉండడానికి...సినిమా ఫలితం వేరేలా ఉండడానికి కూడా పలు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: