మా నాన్న వీక్నెస్ అదే.. నాకు పెళ్లి అయిన తర్వాతే తెలిసింది : మంచు విష్ణు
కేవలం సినిమాల్లోనే కాదు ఆయన గంభీర తత్వానికి అటు చిత్ర పరిశ్రమలో కూడా అందరు గజగజ వణికి పోతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అందరినీ చెడామడా తిట్టేయడమే కాదు ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకోవడం కూడా మోహన్ బాబు కి తెలుసు. అవును.. ఇంతకీ ఇప్పుడు మోహన్ బాబు గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ప్రతి నటుడికి ఒక వీక్నెస్ వుంటుంది. కొంతమందికి నటనలో మరికొంతమందికి నిజజీవితంలో వీక్నెస్ లు ఉంటాయి. కానీ ఇక సినీ సెలబ్రిటీల కు సంబంధించిన వీక్నెస్ను మాత్రం ఎక్కడ బయటికి రానివ్వరు.
కానీ ఇటీవలే మాత్రం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తన తండ్రి వీక్నెస్ ఏంటి అన్న విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు పెళ్లయిన తర్వాత ఆ వీక్నెస్ నాకు కూడా పట్టుకుంది అంటూ తెలిపాడు. ఇంతకీ ఆ వీక్నెస్ ఏంటి అంటారా.. కూతురు వీక్నెస్ .. ప్రస్తుతం మోహన్ బాబుకు మంచు విష్ణు మంచు మనోజ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ ఇక వీరిద్దరి కంటే ఎక్కువగా కూతురు మంచు లక్ష్మి ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. కాగా ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన మంచు విష్ణు.. తన అక్క లక్ష్మి చేసిన అల్లరి పనులు మేము చేసి ఉంటే మా నాన్న ఇప్పటివరకు తాట తీసే వారు అంటూ చెప్పుకొచ్చారు ఎందుకంటే ఆయనకు అక్క అంటే అమితమైన ప్రేమ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో ఎందుకు ఇలా ఉండేది అని అర్థం కాక పోయేదని.. కానీ ఇక తాను పెళ్లి చేసుకొని తండ్రి అయిన తర్వాత కూతురంటే ఎందుకు అంత ప్రేమ ఉంటుందో అర్థమైంది అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.