బన్నీ బీట్స్ .. ఆ హైట్స్ ను చేరుకోగలరా?
ఈ పాటను రాసిన చంద్రబోస్ పై ప్రశంశల వర్షం కురుస్తోంది. ఎప్పుడూ ప్రయత్నించని ఒక కొత్త పంథాలో రాసిన పాట అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపచేస్తోంది. ఇక ఎప్పటి లాగే అద్భుతమైన బాణీలను అందించే దేవి శ్రీ ప్రసాద్ మరో సారి తన మ్యూజిక్ తో మాయను చేశాడు. ఇక ఈ పాట కోరియోగ్రఫీ మరియు బన్నీ నటన హైలైట్ అని చెప్పవచ్చు. ఒక్కపాటతోనే ఇన్ని మాయలు చేస్తే ఇక సినిమాలో ఎన్నెన్ని మాయాలున్నాయో అంతుబట్టడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా పుష్ప వైపే చూస్తోంది. ఆగష్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన 'సర్కారువారిపేట' టీజర్ కనీసం మహేష్ బాబు అభిమానవులను కూడా ఆకట్టుకోవడంలో విఫలమయింది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ కి బ్రేకులు వేసేలా ఉందని ఇప్పటికే ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న మహేష్ కు నిరాశ తప్పేలా లేదని సినిమా వర్గాలు సైతం గుసగుసలాడుకుంటున్నాయి. ఇక ఈ సినిమాతో బన్నీ పుష్పను పోల్చాలంటే అస్సలు సరిపోదు. బన్నీ మూవీ నుండి విడుదలయిన పాట రేంజే లో కాదు కదా, దరిదాపుల్లో కూడా 'సర్కారువారుపాట' లేదని చెప్పాలి. ప్రయోగాత్మక కథలను చేయడంలో ఎప్పుడూ ముందునే ప్రిన్స్ మహేష్ ఈ సారి బొక్క ఆబొర్లా పడేలా ఉన్నాడని సినిమా క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకు కొనసాగుతున్న ఊహాగానాలు మాత్రమే సినిమా రిలీజ్ అయ్యాక ఏ సినిమా ఎలా ఉంది అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. అప్పటివరకు వేచి చూడాల్సిందే.