వెంకటేష్ సినిమా కేరీర్ కు 35 ఏళ్ళు...!

murali krishna
దగ్గుపాటి వెంకటేష్ తన తండ్రి దగ్గుపాటి రామానాయుడు తనయుడుగా టాలీవుడ్ లో తెరంగ్రేటం చేసి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా పేరు పొందారు.  తనదైన ప్రతిభతో మాస్, క్లాస్ మరియు ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుని విక్టరీ వెంకటేష్ గా పేరు పొందారు. ఈ శనివారంతో వెంకటేశ్ హీరోగా 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్నట్లు సమాచారం. 1986 ఆగష్టు 14న విడుదలైన 'కలియుగ పాండవులు'సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు వెంకటేష్. 35 యేళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ఏడు నంది అవార్డులు మరియు 6 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారట
కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేష్ అప్పటి నుంచి ఇటీవల విడుదలైన నారప్ప మరియు తరువాత రాబోయే ఎఫ్ 3 వరకు వెంకటేష్ నట ప్రస్థానం కొనసాగిస్తువచ్చారు. విక్టరీ వెంకటేష్‌ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా కూడా తన సొంత టాలెంట్‌తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నట్లు సమాచారం. అందుకే ఆయన విక్టరీ హీరోగా ఆయన ఫ్యాన్స్ నుండి బిరుదు లభించింది .
వెంకటేష్ సినీ ప్రస్థానంలోవెంకటేష్ కు ఫ్యామిలీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. విజయం సాధించిన టాప్ భారీ సినిమాలు ఇవే..
కలియుగ పాండవులు, శ్రీనివాస కళ్యాణం, ప్రేమ, బొబ్బిలి రాజామరియుశత్రువు, క్షణ క్షణం, చంటీ, సుందరకాండ, ధర్మ చక్రం, సాహసవీరుడు సాగరకన్య అలాగే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం,పెళ్లి చేసుకుందాం అదేవిధంగా సూర్యవంశం,గణేష్,ప్రేమంటే ఇదేరా,రాజా,కలిసుందాం రా మరియు జయం మనదేరా,నువ్వు నాకు నచ్చావ్ వంటి కామెడీ చిత్రం అలాగే వసంతం,మల్లీశ్వరి,సంక్రాంతి,లక్ష్మీ,ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే,తులసి,సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు,దృశ్యం వంటి థ్రిల్లర్ మూవీ ,ఎఫ్ 2,వెంకీ మామ,నారప్ప, ప్రస్తుతం ఎఫ్ 3 మూవీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించనున్నాడు వెంకటేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: