బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ శ్యామ్ ఇటీవల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోయిన సంగతి అందరికీ విదితమే. అయితే, ఆయన చావుకు ఒక రకంగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కారణమంటూ సంచలన ఆరోపణ చేశారు అనుపమ్ శ్యామ్ సోదరుడు అనురాగ్. ఇంతకీ ఆయన చేసిన ఆరోపణ ఏమిటంటే..
అమీర్‌ఖాన్ నటించిన ఫిల్మ్స్ ‘లగాన్, మంగళ్ పాండే: ది రైజింగ్’లో అమీర్‌తో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ శ్యామ్‌ను బతికించేందుకుగాను తమకు డబ్బు అప్పుగా ఇస్తానని అమీర్ మాటిచ్చాడని అనురాగ్ పేర్కొన్నాడు. అయితే, ఆ తర్వాత క్రమంలో ఏమైందో ఏమో తెలియదు కానీ అమీర్ తర్వాత తమ ఫోన్ కాల్స్‌కు స్పందిచలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమీర్‌ను తీవ్రంగా విమర్శించాడు అనుపమ్ బ్రదర్ అనురాగ్. అమీర్ ఖాన్ మెటీరియలిస్టిక్ అని ఆరోపించాడు. మీరు చనిపోయినప్పుడు భౌతిక సంపదను మీతో తీసుకెళ్లలేరని అమీర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. చాలా మంది నటులు, టెక్నీషియన్స్, కొరియోగ్రాఫర్స్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రారని ప్రశ్నించాడు.
తము సాయం కోసం అమీర్‌ను కోరే క్రమంలో అమీర్ రిప్లై ఇవ్వడం మానేయడంతో అనుపమ్ హర్ట్ అయినట్లు అనురాగ్ తెలిపాడు. అమీర్ తన సోదరుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఉంటే ఈ రోజు అనుపమ్ జీవించి ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు అనురాగ్. అయితే, అనురాగ్ వ్యాఖ్యలపై అమీర్‌ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.. నటుడు అనుపమ్ శ్యామ్ కొన్నేళ్లుగా మూత్రపిండాల డిసీజ్‌తో బాధపడుతున్నారు. మరణానికి ముందు చాలా రోజుల నుంచి ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హాస్పిటల్‌లోనే పరిస్థితి విషమించి అనుపమ్ ప్రాణాలు కోల్పోయాడు. తెరపైన విలన్‌గా అనుపమ్ బాగా పాపులర్ కాగా ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ2’ అనే టీవీషో పేరు అతడికి ఇంటి పేరుగా మారిపోవడం విశేషం.