విజయేంద్ర ప్రసాద్ గుబురు గెడ్డం పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు !
ఇలాంటి పరిస్థితులలో ‘కనపడుటలేదు’ అనే ఒక చిన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ సినిమా మేకింగ్ సామధ్యం పై విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ కు రామ్ గోపాల్ వర్మ వేసిన సెటైర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఈవెంట్ కు వచ్చిన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాను వర్మ సినిమాలను చాల అభిమానిస్తానని ‘శివ’ లాంటి గొప్ప సినిమాను తీసిన వర్మకు ఇప్పుడు ఏమైందో తనకు అర్థం కావడం లేదు అంటూ తన ఆవేదన వ్యక్త పరిచాడు.
ఆతరువాత వేదిక పైకి వచ్చిన వర్మ మాట్లాడుతూ విజయేంద్ర ప్రసాద్ ఆవేదనకు డైరెక్ట్ గా సమాధానం ఇవ్వకుండా మరొక విధంగా విజయేంద్ర ప్రసాద్ గడ్డంను టార్గెట్ చేస్తూ వచ్చాడు. చాలారోజులుగా తాను విజయేంద్ర ప్రసాద్ ను ఒక ప్రశ్న అడగాలని ప్రయత్నిస్తున్నానని అంటూ ఒక జోక్ పేల్చాడు. రోజురోజుకు విజయేంద్ర ప్రసాద్ ఎందుకు అలా గెడ్డం పెంచుకుంటున్నాడో తనకు అర్థం కావడంలేదని అంటూ రామాయణ ఇతివృత్తంగా ‘సీత’ అనే మూవీకి కథ ఇస్తున్నాడు కాబట్టి తనకు తాను వాల్మీకి లా భావించి గెడ్డం పెంచుకున్నారా అంటూ జోక్ చేసాడు.
అంతేకాదు తన కొడుకు రాజమౌళి గెడ్డం పెంచగాలేనిది తాను ఎందుకు పెంచలేనని భావించి ఇలా దర్శకుడుగా రాజమౌళిని ఓడించ లేకపోయినా గెడ్డం విషయంలో తన కొడుకును ఓడించాను అన్న తృప్తి కోసం ఇలా గెడ్డం పెంచుతున్నారా అంటూ మరొక జోక్ పేల్చాడు. అదీకాకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లా మారిపోదామని ఇలా గెడ్డం పెంచుతున్నారా అంటూ వరసపెట్టి వేసిన జోక్ లకు విజయేంద్ర ప్రసాద్ కూడ తన నవ్వును ఆపుకోలేకపోయాడు..