టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మహేష్ ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది. ఆయనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇప్పటికీ లేడీ ఫ్యాన్స్ ఆయన్ని తమ కలల రాకుమారుడు గానే చూస్తుంటారు. అంత హ్యాండ్సమ్ లుక్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తారు మహేష్. వయసు 46 దాటుతోంది అయినా ఇంకా టీనేజీ కుర్రాడిలా , యువరాజులా కనిపిస్తారు. మహేష్ కొన్ని స్టిల్స్ చూస్తుంటే టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తంలోనే ఇంతకంటే అందగాడు, హ్యాండ్సమ్ హీరో మరొకరు లేరేమో అనిపిస్తుంది. అంతగా తన ఫిట్నెస్ ని గ్లామర్ ని మెయింటైన్ చేస్తున్నారు మన మహి. ఆగస్ట్ 9, 1975 న ఘట్టమనేని కుటుంబంలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా జన్మించారు మహేష్. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు ఘనంగా జరుపుతున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో అయితే మోత మోగుతోంది.
మహేష్ అభిమానులతో సరిలేరు ఇంకెవ్వరూ అన్న రేంజ్ లో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఈ వయసులో కూడా అంత ఫిట్ గా గ్లామర్ గా ఉండటానికి కారణం ఆయన వర్కౌట్స్, ఫుడ్ హ్యాబిట్స్, టైం పంచ్యువాలిటి అని తెలుస్తోంది. ఇపుడు ఆ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. ఏడాదిలో 365 రోజులూ వ్యాయామం చేస్తుంటారు మహేష్. ఏది ఏమైనా ఈ పద్ధతిని మాత్రం బ్రేక్ చేయరు. షూటింగ్స్ కారణంగా ఎంత ఆలస్యమైనప్పటికీ పొద్దున్నే లేచి జిమ్‌లో వర్క్ అవుట్ లు చేయడానికి రెడీ అయిపోతారు మహేష్ అని ఆయన ట్రైనర్స్ అంటున్నారు. ఆహారం విషయంలోనూ అంతే స్ట్రిక్ట్ గా ఉంటారట. ఒక రోజుకి అయిదారు సార్లు కొద్ది కొద్దిగా తింటుంటారు మహేష్. ఓట్స్, నట్స్, పండ్లు, గుడ్లతో కలిపిన మాష్‌ని బ్రేక్‌ఫాస్ట్‌గా ప్రతి రోజూ తింటారట. అలాగే వర్కవుట్ అయిన వెంటనే ఏదైనా మిల్క్ షేక్ తాగడం అలవాటు. లంచ్‌లో బ్రౌన్ రైస్ తప్పనిసరి, అలాగే క్వినోవాలతో పాటు ఫిష్, చికెన్, మటన్‌లలో ఏదైనా ఒక ఐటెం ని తీసుకుంటారు. ఇక నైట్ డిన్నర్ సమయంలో ప్రొటీన్స్ లేదా కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న ఆహార పదార్దాలు తింటారట మహేష్.
ఇలా క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఫాలో అవుతారట. ఫిట్నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారట మహేష్ బాబు. అందుకే ఆయన అంత గ్లామర్ గా ఉంటారు. అయితే చాలా మంది ఇదే అలవాట్లను పాటిస్తున్నా కూడా మహేష్ అంత హ్యాండ్ సమ్ గా ఉండే అవకాశమే లేదు. కానీ మహేష్ మాత్రం ఎప్పుడూ తన ముఖంపై చిరునవ్వుతో ఉంటారు. ఎటువంటి బాధను బయటకు వ్యక్తపరచరు. ఇలా సంతోషంగా ఉండడం వలన కూడా మన ముఖం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది. అలాంటి అందమైన మహేష్ బాబు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.