మంత్రులతో భేటీ అయిన మంచు మనోజ్.. కారణం అదేనా..?
ఇక ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రం అనంతగిరిలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక టూరిజం ప్రాజెక్ట్ కోసం కొన్ని అంశాలను చర్చించడానికి..మంచు మనోజ్ వీరితో భేటీ అయ్యారు. ఇప్పటికే ఈ టూరిజం ప్రాజెక్టుకు దాదాపు రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వచ్చారు. వారిలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉండడం గమనార్హం. ఇక కేవలం ఈ టూరిజం ప్రాజెక్టులను అనంతగిరిలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలలో కూడా, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం కోసం పాటుపడేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఈ టూరిజం ప్రాజెక్టు ద్వారా కొన్ని వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కలిగించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇక అంతే కాదు సుమారుగా అటు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో సుమారుగా 1000 మందికి ఉపాధి లభించవచ్చు అని శ్రీనివాస్ గౌడ్ తెలిపాడు. అంతేకాదు మనోజ్ కుమార్ ఈ భేటీలో పాల్గొని , ఆయన ప్రిపేర్ చేసి పెట్టుకున్న అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్నెస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయాలని వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నతాధికారులకు తన అభిప్రాయాలను వెల్లడించారు.