తెరపైకి పీవీ సింధు బయోపిక్... రంగంలోకి తెలంగాణ మంత్రి ?
ఈ చిత్రం భావి భవితకు స్ఫూర్తిదాయకంగా మారుతుందని భావిస్తున్నారట. ఈమె బయోపిక్ వెనుక తెలంగాణ మంత్రి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఈ బయోపిక్ తెరకెక్కితే తెలంగాణ ఘనత మరింత పెరుగుతుందని వారు యోచిస్తున్నారట. పీవీ సింధు గొప్ప క్రీడాకారిణి మాత్రమే కాదు ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొని పతకాలను గెలుచుకున్న విజేత కూడా. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్ పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకుని ప్రభంజనం సృష్టించారు. ఈ సంవతసరం జరిగిన ఒలింపిక్వ గేమ్స్ర 2020 లో కూడా సెమీస్ వరకు చేరుకొని భారతదేశ ఖ్యాతిని మరింత పెంచింది. కానీ చివరికి కాంస్యంతో సరిపెట్టుకుంది.
వరుసగా పాల్గొన్న రెండు ఒలింపిక్ గేమ్స్ లలో పతకం సాధించడం ద్వారా మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్తో 2017, 18ల్లో రజత పతకాలను అందుకున్నారు సింధు. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్గా సంచలనం సృష్టించారు పీవీ సిందు . ఇటువంటి గొప్ప క్రీడాకారిణి కి దేశం నలుమూలల నుండి ప్రశంసల జల్లులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఈమె ఇంతటి పేరు ప్రఖ్యాతలు పొందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం అని, భారత మాత ముద్దు బిడ్డ అని ప్రశంసిస్తున్నారు. ఇందులో సింధుగా ఎవరు నటిస్తారు, డైరెక్టర్ ఎవరు అన్న పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.