ఎన్టీఆర్ తల్లి షాలిని వచ్చిన ఫస్ట్ సినిమా ఫంక్షన్ ఇదే...!
ఈ మూవీ అప్పట్లోనే రూ.15 కోట్ల షేర్ ను బాక్సాఫీస్ వద్ద రాబట్టి , ఆల్ టైం హిట్ రికార్డును క్రియేట్ చేసింది. అంతే కాదు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం ఈ సినిమా కోసం ఆపరేషన్ చేయించుకుని మరీ ఎన్టీఆర్ 30 కేజీల బరువు తగ్గాడు. ఈ సినిమాలో తన సరికొత్త లుక్ ను చూడటం కోసమే అభిమానులు తెగ ఎగబడ్డారు అని చెప్పవచ్చు. ఇక యమదొంగ సినిమా కి ముందు కృష్ణవంశీ డైరెక్షన్ లో లో ఎన్టీఆర్ రాఖీ సినిమాను తీయడం జరిగింది. అప్పటి వరకు చాలా లావుగా ఉన్న ఎన్టీఆర్, యమదొంగ సినిమా కోసం బరువు తగ్గడం విశేషం.
ఇక ఈ యమదొంగ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో 300 మంది కార్మికులు శ్రమించి, సెట్ వేయడం జరిగింది. ఇక 400 టన్నుల లైటింగ్ కూడా పెట్టారట. ఇక ఇది అప్పట్లో ఒక వైరల్ గా మారిన విషయం. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ , అలాగే మీరా చోప్రా లను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత వారిద్దరూ సినిమాను ఒప్పుకోక పోవడంతో , ఆ ప్లేస్ లో ప్రియమణి అలాగే మమతా మోహన్ దాస్ లు కలిసి నటించి, సినిమాను హిట్ చేశారు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ తల్లి షాలిని హాజరుకావడం అప్పట్లో విశేషంగా చెప్పుకొచ్చారు.