వామ్మో.. సుడిగాలి సుధీర్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?
ప్రస్తుతం బుల్లితెరపై సుడిగాలి సుదీర్ మల్టీ టాలెంటెడ్ గా కొనసాగుతున్నాడు. ఒక వైపు జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్గా అందరినీ నవ్విస్తూ ఉన్నారు. మరోవైపు ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో యాంకర్ గా తన వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇంకోవైపు స్పెషల్ ఈవెంట్ లలో మ్యాజిక్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. అదే సమయంలో అటు హీరోగా సినిమాలు కూడా చేస్తూ అభిమానులను ఎంతగానో ఉర్రూతలూగిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక ఇటీవల విడుదలైన ఢీ ప్రోమో లో సుడిగాలి సుదీర్ తనలోని మరో యాంగిల్ చూపించాడు. ఇప్పటి వరకు సుడిగాలి సుదీర్ నటిస్తాడు అన్న విషయం అందరికీ తెలుసు కానీ ఏ హీరో పాత్రలో అయినా ఒదిగిపోయి నటిస్తూ ఆ హీరో స్టైల్ అచ్చుగుద్దినట్లుగా దింపేసాడు అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. ఇక ఇటీవలే విడుదలైన ప్రోమోలో ఏకంగా రజనీకాంత్ స్టైల్ లో పర్ఫామెన్స్ చేసి అదరగొట్టాడు సుడిగాలిసుధీర్. ఇటీవల విడుదలైన ఢీ షో కి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందులో భాగంగా రెండుసార్లు రజనీకాంత్ గెటప్ లో కనిపిస్తాడు సుడిగాలి సుధీర్. అచ్చంగా రజినీకాంత్ స్టేజి మీదికి వచ్చి యాక్టింగ్ చేస్తూ డైలాగులు చెబుతున్నాడేమో అన్న విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ ని అచ్చుగుద్దినట్టు దింపేస్తాడు. దీంతో ఇది చూసిన ప్రేక్షకులు సుధీర్ లో ఇలాంటి యాంగిల్ కూడా దాగి ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.