టాలీవుడ్ యంగ్ హాట్ హీరోయిన్స్ లో ఒకరు నభా నటేష్. నభా నటేష్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా హాట్ గా కనిపించి మంచి ఆఫర్లు కొట్టేస్తుంది. అయితే సినీ కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ మినహా మరో విజయం లేకపోవడంతో స్టార్ హీరోలు ఈ బ్యూటీని అస్సలు పట్టించుకోవడం లేదు. టాలెంట్, గ్లామర్ ఉన్నా విజయాలు తక్కువగా ఉన్న ఈ హీరోయిన్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఏకంగా హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరో సరసన ఈ ఇస్మార్ట్ బ్యూటీ నటించబోతున్నట్లు సమాచారం.
హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కబోతున్న the night manager అనే ఒక టీవీ సిరీస్ ఆధారంగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కబోతుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మరియు మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నట్లు సమాచారం.
స్టార్ హీరోతో బాలీవుడ్ లో అడుగు పెట్టి విజయం సాధిస్తే నభా నటేష్ కు ఇతర బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నభా నటేష్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ కు జోడీగా ఆంధదున్ రీమేక్ గా వస్తున్న మ్యాస్ట్రో సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ సినిమా అంధాధూన్ అక్కడ భారీ విజయం సాధించింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలని ఉద్దేశంతో రీమేక్ గా మ్యాస్ట్రో సినిమా తెరకెక్కుతోంది. మ్యాస్ట్రోతో నభా నటేష్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఫైటర్ సినిమాతోచాలా బిజీగా ఉండగా రాబోయే వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో సమాచారం రావాల్సి ఉంది.హిందీ సినిమాలో ఛాన్స్ రావడం గొప్ప విషయమే అది హృతిక్ రోషన్ తో మరి ఈ వెబ్ సిరీస్ లో నభా నటేష్ నటిస్తున్నారని సమాచారం అందిన ఈ వార్తకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. హృతిక్ సరనస నటిస్తే నభా నటేష్ జాతకం మారుతుందొ లేదో చూడాలి మరి.