ఆ విషయంలో పూరీ బెస్ట్ అట..!

Suma Kallamadi
వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలు అన్నిటికీ దాదాపుగా ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథలు అందిస్తుంటారు. కాగా, ఇటీవలి కాలంలో పలు మీడియా సంస్థలకు విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పట్ల విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరీ ఆ విషయంలో ది బెస్ట్ అని పేర్కొన్నాడు. ఇంతకీ విజయేంద్రప్రసాద్ పూరీ గురించి ఏమన్నారంటే..

తన కొడుకు ఎస్.ఎస్.రాజమౌళి అద్భుత ప్రతిభ కలిగిన దర్శకుడు అయినప్పటికీ ఆయనకు తనంతట తానుగా కథలు రాసుకోవడం కాస్త కష్టమేనని చెప్పాడు. అయితే, గుడ్ స్టోరీస్‌ను ఎంచుకోవడంలో మాత్రం రాజమౌళికి సరి ఎవ్వరూ లేరని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఇకపోతే సినిమా తీయడంలో దిట్ట అయినప్పటికీ రాజమౌళి మేకింగ్‌ చాలా స్లోగా ఉంటారని, ఒక్కోసినిమాకు చాలా టైం తీసుకుంటారని చెప్పాడు. ఈ విషయంలో క్రియేటర్ డైరెక్టర్ సుకుమార్ కూడా అంతేనని చెప్పాడు. సినిమాలు తీయడంలో వాళ్లు ఎక్స్‌పర్ట్స్ అయినప్పటికీ మేకింగ్ పరంగా వెరీ స్లో అని పేర్కొన్నాడు. కాగా, సినిమాలు తీయడంలో పూరీ జగన్నాథ్‌కు సాటి ఎవ్వరు ఉండబోరని, ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పాడు విజయేంద్రప్రసాద్.


పూరీలో తనకు నచ్చిన లక్షణం అదేనని పేర్కొన్నాడు విజయేంద్రప్రసాద్. అతి చిన్న సన్నివేశంలోనూ ఫైట్ యాడ్ చేసే టాలెంట్ పూరీ వద్ద ఉందని ప్రశంసించాడు. పూరీ జగన్నాథ్ స్టోరీ ప్లస్ డైలాగ్స్ కూడా వినూత్నంగా ఉంటాయని చెప్పారు. తనకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నా చాలా ఇష్టమని చెప్పాడు.  ఇకపోతే రాజమౌళి నుంచి మున్ముందు కూడా సినిమాలు స్లోగానే ఉండబోతాయని గెస్ చేశాడు విజయేంద్రప్రసాద్. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి అందరికీ విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: