ప్రేక్షకుల తప్పులేదు అంటున్న ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇరు రాష్ట్రాలలో తెరుచుకున్న థియేటర్స్ కు సంబంధించి తొలి వీకెండ్ ఫలితాల పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు చేస్తున్న విశ్లేషణలో కొన్ని ఆశక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఫలితాలను చూస్తే కరోనా వైరస్ భయాలు కొనసాగుతున్నపటికి ప్రేక్షకులు సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు అన్న సంకేతాలు తమకు వస్తున్నాయని ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.


గతవారం విడుదలైన ‘ఇష్క్’ ‘తిమ్మరుసు’ మూవీల కలక్షన్స్ విశ్లేషణలు పరిశీలిస్తే ‘ఇష్క్’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడంతో చతికిలపడింది కానీ అందులో ప్రేక్షకుల తప్పులేదు అని కొందరి అభిప్రాయం. ఇక ‘తిమ్మరుసు’ విషయానికి వస్తే ఈసినిమాకు వచ్చిన కలక్షన్స్ పరిశీలిస్తే పరవాలేదు అని అనిపించడంతో పాటు కొన్ని చోట్ల గడిచిన ఆదివారం నాడు ఈమూవీ హౌస్ ఫుల్ కలక్షన్స్ చూడటంతో ప్రేక్షకులు సినిమాలు చూడడానికి రెడీగా ఉన్నారు అంటూ ఇండస్ట్రీలోని కొందరి వాదన.


అయితే ఈపరిస్థితి మన ఇరు రాష్ట్రాలలోని బిసి సెంటర్లలో భిన్నంగా ఉందని అక్కడి ప్రేక్షకులు ఒకమంచి మాస్ సినిమాను కోరుకుంటున్నారని ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా టాప్ హీరో ధైర్యం చేసి తమ మూవీని భారీ పబ్లిసిటీతో విడుదల చేస్తే ఆమూవీకి కలక్షన్స్ రావడం ఖాయం అని కొందరి ఇండస్ట్రీ ప్రముఖుల అభిప్రాయం. అయితే ఈవాదనతో చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు ఏకీభవించడం లేదు.


ఈసంవత్సరం ఏప్రియల్ లో కరోనా భయాలను పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ను విడుదల చేసినప్పుడు ఆమూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్ తరువాత సాధారణ ప్రేక్షకులు ఆ సినిమాను చూడటానికి ధియేటర్లకు రాకపోవడంతో ఆమూవీ బయ్యర్లకు బయటకు చెప్పుకోలేని నష్టాలు వచ్చాయని కొందరి అభిప్రాయం. ఇలాంటి పరిస్థితులలో రాబోతున్న థర్డ్ వేవ్ భయాలను పక్కకు పెట్టి భారీ సినిమాలను విడుదల చేస్తే మళ్ళీ ఎటువంటి తేడాలు వచ్చి ధియేటర్లు మూతపడితే బయ్యర్లకు వచ్చేనష్టాలు ఎవరు తీరుస్తారు అంటూ మరికొందరి వాదన. వాస్తవానికి ‘టక్ జగదీష్’ ‘లవ్ స్టోరీ’ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నా థర్డ్ వేవ్ భయాలు టిక్కెట్ల రెట్లు అంశాలు తేలకుండా ఈ మూవీలు ఇప్పట్లో విడుదల కావు అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: