బాలీవుడ్ లో తెరకెక్కనున్న దిగ్గజ క్రీడాకారుడి బయోపిక్..?
భారతదేశ పక్షమున ఆడటమే కాదు భారతదేశానికి పతకాలు కూడా తెచ్చి పెట్టారు. ఈ క్రీడాకారుడు మొత్తం 6 సార్లు ఇండియాకి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆరు సార్లలో రెండు సార్లు పతకాలు సాధించారు. 1998, 2002 సంవత్సరాల్లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ పోటీలలో భారత్ తరఫున సింగిల్ మెన్ గా వెళ్ళారు. ల్యూజ్ పోటీలలో అద్భుతంగా ఆడి పతకాలు గెలిచి భారత దేశ జెండాని వింటర్ ఒలంపిక్స్ లో ఎగురవేశారు. ఇక ఒలింపిక్స్ లో అద్భుతాలు సృష్టించిన శివ కేశవన్ ఏషియన్ ల్యూజ్ ఛాంపియన్ షిప్స్ లో ఏకచ్ఛత్రాధిపత్యం వహించారు. ల్యూజ్ పోటీలలో మకుటం లేని మహారాజుగా రాణిస్తూ ఎన్నో అవార్డులను పట్టేశారు. అయితే ఈ గొప్ప క్రీడాకారుడు జీవిత కథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కపూర్ సిద్ధమయ్యారు. ఈయన నటుడిగా, రచయితగా, నిర్మాతగా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుడిగా మారి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే కునాల్ కపూర్ తెరకెక్కించనున్న శివ కేశవన్ లైఫ్ డ్రామా గురించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే బయోపిక్ చేస్తున్నట్లు కునాల్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. వింటర్ ఒలంపిక్స్ క్రీడాకారుడి జీవిత చరిత్రలు వెండితెరపై చూపించనున్నానని ఆయన ప్రకటించారు. మరి ఈ ప్రత్యేకమైన బయోపిక్ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.