శిల్పా శెట్టి కి మద్దతుగా నిలిచిన కోలీవుడ్ స్టార్..

Divya
శిల్పా శెట్టి.. తన భర్త రాజ్ కుంద్రా ఇటీవల పోర్న్ కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే. ముంబై పోలీసులకు చిక్కిన ఆధారాల మేరకు రాజ్ కుంద్రాను అలాగే అతనితో పాటు మరో 11 మంది సెలబ్రిటీలను అరెస్టు చేయడం జరిగింది. ఇకపోతే ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజ్ కుంద్రా కు, ఇతర వ్యక్తులకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు లెక్క తేలేవరకు ఎవరికి క్లీన్ చిట్ ఇచ్చే పరిస్థితే లేదని తేల్చి చెప్పేశారు. దీంతో శిల్పా శెట్టి కూడా చేసేదేమీలేక ముంబై పోలీసులకు సహకరిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవల ఆమె స్నేహితుడు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ఆమెకు మద్దతు తెలపడానికి ముందుకు వచ్చారు..

అతను ఎవరో కాదు తన స్నేహితుడు ఆర్ మాధవన్.. శిల్పా శెట్టి కి మద్దతుగా నిలుస్తున్నారు.. ఇక శిల్పా శెట్టి కి సపోర్ట్ అందిస్తూ మాధవన్ ఇంస్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ చేశాడు.. "మీరు నాకు బాగా కావలసిన వ్యక్తులలో ఒకరు. నేను మీకోసం, మీ కుటుంబం కోసం ఎప్పుడూ అండగా ఉంటాను. మీ బాధలను తీర్చడానికి ..నేను మీతో,  మీ కుటుంబంతో ఎల్లవేళలా అండగా నిలబడతానని" ఆయన రాయడం జరిగింది.

తన స్నేహితుడు ఆర్ మాధవన్ ఇచ్చిన పోస్ట్ కు .. రీ పోస్ట్ పెట్టింది శిల్పాశెట్టి.. తన పోస్టు ద్వారా.." అవును..!  గత కొన్ని రోజులుగా.. మా మీద ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మేము ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాము. ఎన్నో ఆరోపణలు మామీద తలెత్తుతున్నాయి.. ఇక మీడియా తో పాటు మా మంచి కోరుకునే వారు కూడా మాపై ఆంక్షలు విధించారు..ఇప్పటి వరకు అసలు నిజాలు తెలియడంలేదు. తెలిసే వరకు నేను నా మౌనాన్ని వీడను. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మమ్మల్ని ఆపాదించడం ఆపివేయండి.." అంటూ శిల్పాశెట్టి కోరింది.
ఇప్పటివరకు నా భర్త రాజ్ కుంద్రా పై ఎలాంటి తప్పుడు ఆధారాలు దొరకలేదు. అంతే కాదు మీరు కూడా ఎలాంటి ఆధారాలు లేని నివేదికలను ప్రచురించవద్దని.. ఆమె మీడియా ను కోరింది. అంతేకాదు మాధవన్ తనకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు కూడా తెలిపింది శిల్పాశెట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: