నాగార్జున చేసిన తప్పులే ఆయన్ను బాలీవుడ్ స్టార్ కాకుండా అడ్డుపడ్డాయా ?
ఇక్కడ నాగార్జున మోస్ట్ బిజీ హీరోగా ఉన్న సమయంలోనే హిందీ నుండి ఆయనకు వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి. అప్పట్లోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ తో కూడా కలసి నటించాడు. ఇక వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన కొన్ని సినిమాలు సైతం బాలీవుడ్‌కు వెళ్లాయి. నాగార్జునకు హిందీలో కూడా చాలా తక్కువ సినిమాలకే మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా నాగార్జున రొమాంటిక్ లుక్ అక్కడ ప్రేక్షకులను కట్టి పడేశాయి.
అయితే అదే సమయంలో నాగార్జున చేసిన కొన్ని తప్పులే ఆయన్ను అక్కడ స్టార్ హీరో కాకుండా చేశాయి. కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా కూడా నాగార్జున వదులుకున్నాడు. అవన్నీ అక్కడ సల్మాన్, షారుఖ్, గోవిందా లాంటి హీరోలు చేసి హిట్లు కొట్టారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాలో నాగార్జున పక్కన డింపుల్ కపాడియా ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది.
అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పారు. అయితే ఎస్. గోపాల్ రెడ్డికి, నాగార్జున అన్నకు కథలో కొన్ని పాయింట్లు నచ్చలేదు. అయితే దర్శకుడు వాటిని మార్చేందుకు ఒప్పుకోలేదు. అలా ఆ సినిమా మిస్ అయ్యింది. ఇక నాగార్జున అప్పట్లో చేయాల్సిన పాన్ ఇండియా సినిమాలు వదులుకోవడంతోనే ఆయన బాలీవుడ్ స్టార్ కాలేకపోయాడని కొందరు అంటుంటారు.