శ్రీదేవిని ఎత్తుకొని వెళ్లిన ఆ టాప్ ప్రొడ్యుస‌ర్ ?

VUYYURU SUBHASH
అందాల తార... అతిలోక సందరి గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. అప్పట్లో తన నటనతో, అమాయకపు చూపులతో ఎంతోమంది కుర్రకారును కట్టిపడేసింది. ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో కూడా నటించి, అన్ని రాష్ట్రాల ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటి. ముఖ్యంగా అప్పట్లో హీరోలు ఈమెతో నటించడానికి క్యూ కట్టేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇక అంతే కాదు అప్పట్లో అత్యధికంగా పారితోషికం కూడా అందుకునేది. ఇక ఈమె సినిమాలలో నటింపజేయడానికి నిర్మాతలు కూడా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాను సక్సెస్ చూసేవారు.

ఇక అసలు విషయానికొస్తే, శ్రీదేవిని ఒక నిర్మాత ఎత్తుకొని వెళ్ళాడట. ఇంతకూ ఎందుకు ఎత్తుకుని  వెళ్లాడు..అందుకు గల కారణం ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అతనెవరో కాదు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు. ఈయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై  ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. అయితే డి రామానాయుడు, శ్రీదేవి ని ఎత్తుకుని కొంత దూరం నడిచాడట. అలా ఎందుకు అంటే ఆంధ్ర సోగ్గాడి గా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు అలాగే శ్రీదేవి కలిసి నటించిన చిత్రం దేవత.

ఈ చిత్రంలో వెల్లువచ్చి గోదారమ్మ.. అనే ఈ పాట బాగా పాపులారిటీ ని అందుకుంది. అయితే ఈ పాటను రాజమండ్రి దగ్గరలో ఉన్న అగ్రహారంలో షూటింగ్ చేసి,  పాటలు చిత్రీకరించారు. గోదావరి తీర ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరగడంతో, దేవత సినిమా యూనిట్ సభ్యులంతా నదిపై పడవ ప్రయాణం చేశారు. అయితే షూటింగ్ స్పాట్ కి వెళ్లే దారిలో కొంచెం బురద ఉంది. దానిని దాటుకొని స్పాట్ కి వెళ్లాలి.

మిగతావారంతా ఆ బురదలో తొక్కుకుంటూ  వెళ్లి పోయారు. కానీ శ్రీదేవి మాత్రం వెళ్లలేకపోయింది. ఎందుకంటే తను వేసుకున్న డ్రెస్సుకు  బురదలో మట్టి అంటుందేమో అని, అదే విషయాన్ని నిర్మాతకు చెప్పగా, నిర్మాత ఆమెను ఎత్తుకొని స్పాట్ కు  తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత పాటలు చిత్రీకరించడం జరిగింది.1982 సంవత్సరంలో విడుదలైన చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: