రొటీన్ లైఫ్ కు గుడ్ బై.. వార్ జోన్ లోకి ఎంట్రీ..!
సర్జికల్ స్ట్రైక్స్ బ్యాక్ గ్రౌండ్ లో విక్కీ కౌశల్ నటించిన చిత్రం ఉరి. ఈ కారణంతో విక్కీ కెరీరే మారిపోయింది. నేషనల్ అవార్డ్‌తో పాటు, నేషనల్ వైడ్‌గా పాపులారిటీ కూడా వచ్చింది. ఈ ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి 'శామ్ బహదూర్' అనే సినిమా చేస్తున్నాడు. 1971 ఇండో-పాక్ వార్‌లో ఆర్మీ స్టాఫ్‌కి చీఫ్‌గా వ్యవహరించిన 'శామ్ మనేక్షా' లైఫ్‌స్టోరీతో వస్తోందీ సినిమా. సిద్ధార్థ్ మల్హోత్రా వార్‌డ్రామాలోకి వెళ్లిపోయాడు. కార్గిల్ యుద్ధంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా కథాంశంతో 'షేర్‌షా' అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో విక్రమ్ బాత్రాతో పాటు అతని కవలసోదరుడు విశాల్ బాత్రా క్యారెక్టర్ కూడా ప్లే చేస్తున్నాడు సిద్ధార్థ్. కార్తీక్ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా 'కెప్టెన్ ఇండియా' అనే సినిమా చేస్తున్నాడు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న పైలెట్ కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా.
అజయ్ దేవగణ్ కూడా ఈ ఇండో-పాక్ వార్‌తో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాడు. 1971 ఇండో-పాక్ వార్ టైమ్‌లో భుజ్ ఎయిర్ స్ట్రిప్‌ని ఓవర్‌నైట్‌లో రిపేర్ చేసిన 300 మహిళలు, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కర్ణిక్ కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా. మాస్ మూవీస్ ట్రై చేసినా, మాస్ హీరో కాలేకపోతోన్న వరుణ్ ధావన్, మాసివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడానికి ఇండో-పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లోకి వెళ్లిపోతున్నాడు. 1971 ఇండో-పాక్ వార్‌లో బసంతర్ ఘటనలో అమరుడైన అరుణ్ కేధార్‌పాల్ కథాంశంతో 'ఇక్కీస్' అనే సినిమా చేస్తున్నాడు. సినిమా సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేసే అడివి శేష్, 'మేజర్'తో 26/11 ముంబాయి దాడులని తెరకెక్కిస్తున్నాడు. ముంబాయి ఘటనలో ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథాంశంతో రూపొందుతోందీ సినిమా. అలాగే దేశభక్తికి బ్రాండ్‌అంబాసిడర్‌లా మాట్లాడే కంగనరనౌత్ యుద్ధవిమానం నడిపిన మహిళా పైలట్ కథతో 'తేజస్' అనే సినిమా చేస్తోంది. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలాంటి దేశ భక్తి చిత్రాలు వస్తాయో.