ఒకప్పుడు టాలీవుడ్ పరిశ్రమ మూడు రిలీజ్ లు ఆరు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నట్లుగా ఎంతో ముచ్చటగా పరిశ్రమ మొత్తం సందడిగా కళకళలాడుతూ ఉండేది. ఎప్పుడైతే మన దేశాన్ని కరోనా ఆవహించిందో అప్పటి నుంచి టాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా కుడెలైపోయింది. ఎప్పుడు చూసినా సినిమా థియేటర్లు మూసి ఉండడంతో సినిమా నిర్మాతలు తమ సినిమాలను ఎక్కడ విడుదల చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఓటీటీ సంస్థలు ఓ విధంగా సినీ నిర్మాతలకు ప్రేక్షకులకు ఊరట ఇస్తున్న కూడా వాటి రేట్ల విషయంలో పెద్ద పెద్ద ఓ టీ టీ సంస్థలు చాలా తక్కువ రేటు కే సినిమా అడగడంతో నష్టాలతో నే తమ సినిమాలను అమ్ముకుంటున్నారు సదరు నిర్మాతలు. సెకండ్ వేవ్ తర్వాత సినిమా పరిశ్రమ పూర్తిగా చతికిలపడి పోయిందని చెప్పవచ్చు. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తివేసిన రెండు నెలలకు గానీ సినిమాలు విడుదల కావడం లేదు టాలీవుడ్ లో. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రెండు చిన్న సినిమాలు థియేటర్లో విడుదల అవుతున్నాయి.
సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు చిత్రం ఈ శుక్రవారం రోజున థియేటర్లలో విడుదల అవుతుండగా దానితోపాటు తేజ సజ్జ హీరోగా నటించిన ఇష్క్ అనే మరో సినిమా కూడా విడుదలవుతుంది. ఇవి టాలీవుడ్ భవిష్యత్తును నిర్ణయించే సినిమాలు చెబుతున్నారు అయితే ఇప్పటికీ సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అనేది సందిగ్ధతే నెలకొంది. ఏదో గుడ్డిగా ప్రేక్షకులను నమ్మి ఈ సినిమాలను విడుదల చేస్తున్నారు కానీ వారు ఎంత వరకు వస్తున్నారు అనేది విషయం ఎవరికీ తెలియదు. ఈ సినిమాల ప్రమోషన్స్ లో నటీనటులు ప్రేక్షకులను అడుక్కునే విధంగా సినిమా థియేటర్ లో తమ సినిమా నీ చూడమని చెబుతున్నారు. ఈ పరిస్థితి వచ్చినందుకు టాలీవుడ్ దురదృష్టం అని చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి టాలీవుడ్ ఎప్పుడు కోలుకుంటుందో..