ఐదు భారీ సినిమాలు.. థమన్ రచ్చ కన్ఫర్మ్..!

shami
టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే అతనే ఎస్.ఎస్ థమన్. ఆయన మ్యూజిక్ చేస్తే సినిమా మ్యూజికల్ హిట్.. రిలీజ్ కు ముందే మ్యూజిక్ పరంగా హిట్ టాక్ తెచ్చుకోవడం చూస్తున్నాం. తన మ్యూజిక్ తో సినిమాకు నెక్స్ట్ లెవల్ క్రేజ్ వచ్చేలా చేస్తున్న థమన్ ప్రస్తుతం ఐదారు క్రేజీ సినిమాలతో మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలన్ని భారీ సినిమాలే అవడం విశేషం.
అందులో మహేష్ సర్కారు వారి పాట, పవన్.. రానా కలిసి చేస్తున్న మల్టీస్టారర్, రాం చరణ్.. శంకర్ కాంబో మూవీ ఉన్నాయి. ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్.. దీనితో పాటుగా బాలయ్య బాబు గోపీచంద్ మలినేని కాంబో మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న అఖండ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసిందే. రాబోయే ఈ ఐదు భారీ మూవీస్ కు థమన్ తన మ్యూజిక్ తో రచ్చ చేయాలని చూస్తున్నాడు. తప్పకుండా థమన్ తన సంగీతంతో ఈ సినిమాలను మ్యూజిక్ పరంగా ది బెస్ట్ ఉండేలా చేస్తాడని చెప్పొచ్చు.
సినిమా కాన్సెప్ట్ కు తగినట్టుగా ఒక్కో సినిమాకు ఒక్కోలా మ్యూజిక్ అందించేలా చేస్తున్నాడు. సినిమాకు థమన్ మ్యూజిక్ ప్లస్ అయ్యేలా చేస్తున్నాడని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ అంటే ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. రాబోయే ఈ సినిమాలకు ఆ రకంగా కూడా థమన్ అదరగొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలకు థమన్ అందించే మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది సినిమాలు వస్తేనే కాని చెప్పలేం. థమన్ మాత్రం తనకు వచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని వినియోగిచుకునేలా తన టాలెంట్ తో మెప్పించాలని చూస్తున్నాడు. త్వరలోనే మహేష్ సర్కారు వారి పాట నుండి స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతుందని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: