బర్తడే స్పెషల్ : మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన హీరో

Divya
దుల్కర్ సల్మాన్.. ఈయన హీరో మాత్రమే కాదు.. ప్లే బ్యాక్ సింగర్ అలాగే చిత్ర నిర్మాత కూడా. ఈయన ఎక్కువగా తమిళ చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే మలయాళం చిత్రాలకు కూడా దుల్కర్ సల్మాన్ హీరోగా పెట్టింది పేరు. ఇక ఈయన 1986 జూలై 28వ తేదీన ప్రముఖ తమిళ్ స్టార్ మమ్ముట్టి అలాగే సుల్ఫాత్ దంపతులకు జన్మించాడు. తన ప్రాథమిక విద్యను కొచ్చి అలాగే చెన్నైలోని శిష్య స్కూల్లో ముగించాడు. ఇక అమెరికా వెళ్లి అక్కడ పర్డ్యూ విశ్వవిద్యాలయం లో బిజినెస్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టాను అందుకున్నాడు. ఇక చదువు ముగిసిన తరువాత అక్కడే ఐటి డిపార్ట్మెంట్ లో కొంతకాలం పని చేసి, ఆ తర్వాత నటనలో తన సినీ జీవితాన్ని కొనసాగించాలని అనుకున్నాడు.
ఇక అనుకున్నదే తడవుగా ముంబైలోని బారీజాన్ అనే ఒక శిక్షణ స్టూడియోలో మూడు నెలల పాటు శిక్షణ అందుకున్నాడు. 2012 సంవత్సరంలో మొదటి సారి రెండవ ప్రదర్శన అనే మలయాళం సినిమాకు ఎంపికయ్యాడు. తర్వాత అదే సంవత్సరంలోని మలయాళం సినిమా అయినటువంటి ఉస్తాద్ హోటల్ అలాగే తీవరం అనే సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మలయాళం, తమిళ సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తెలుగులో హే పిల్లగాడా సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. 2018లో మహానటి సినిమా ద్వారా భర్త పాత్రలో నటించాడు.
ఇక ఓకే జాను , మహానటి సినిమాల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఆ తర్వాత తిరిగి మలయాళం ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపాడు. అంతేకాదు హిందీలో కూడా నటించాడు. ఇక అవార్డుల విషయానికొస్తే , మొదటి సినిమాతోనే ఆసియా విజన్ అవార్డును ఉత్తమ తొలి నటుడిగా కేరళా నుండి  అందుకున్నాడు. ఆ తర్వాత ఆసియానెట్ ఫిలిం వార్డు, వనిత ఫిలిం అవార్డ్స్, అమృత టీవీ అవార్డు ఇలా ఎన్నో అవార్డులను అందుకోవడం విశేషం. బెస్ట్ సింగర్ గా కూడా కొన్ని అవార్డులను అందుకున్నాడు.

దుల్కర్ సల్మాన్ వ్యక్తిగత విషయానికి వస్తే, 2011 డిసెంబర్ 22వ తేదీన ఆర్కిటెక్ట్ అయిన అమల్ సుఫియాను పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరికి మే 2017 లో ఒక కూతురు కూడా జన్మించింది.
ఇక దుల్కర్ సల్మాన్ మీడియా విషయానికి వస్థే, 2019వ సంవత్సరంలో ఓగ్ ఇండియా అక్టోబర్ ఎడిషన్ కవర్ మీద ఈయన ఫోటో కూడా వచ్చింది.
ఇక అలా కేరళ నుంచి వచ్చిన మొదటి నటుడు గా గుర్తింపు పొందాడు. అంతే కాదు 2013 అలాగే 2014లో టైమ్స్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి కొచ్చి టైమ్స్ లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా కూడా ఎంపికయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: