అబ్బాయి తోనే కాదు ... బాబాయ్ తో కూడా అదరగొడతాడట ..... ??

GVK Writings
తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అతనొక్కడే ఫిలిం తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టి ఆ సినిమాతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్న దర్శకడు సురేందర్ రెడ్డి. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో అతిధి, అలానే ఎన్టీఆర్ తో అశోక్, ఊసరవెల్లి వంటి సినిమాలు తీశారు. అయితే అవి అంతగా సక్సెస్ కాలేదు.
అనంతరం రవితేజ తో కిక్ మూవీ తీసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి, ఇటీవల రామ్ చరణ్ తో ధ్రువ, అలానే అల్లు అర్జున్ తో రేసు గుర్రం వంటి మరొక రెండు బ్లాక్ బస్టర్ విజయాలు కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండేళ్ల క్రితం మెగాస్టార్ తో సైరా నరసింహారెడ్డి వంటి భారీ పాన్ ఇండియా మూవీ తీసిన సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ అక్కినేని తో ఏజెంట్ అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు. అయితే దీని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మాతగా ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న భారీ మూవీ తీయనున్నారు సురేందర్ రెడ్డి.
లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా పక్కాగా కమర్షియల్ జానర్ లో సాగడంతో పాటు పవన్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని రకాల అంశాలు ఇందులో ఉండేలా పక్కాగా స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట సురేందర్ రెడ్డి. కాగా ఈ సినిమాకి వక్కంతం వంశీ కథా సహకారం అందించనున్నట్లు టాక్. గతంలో అబ్బాయి చరణ్ తో ధ్రువ మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న సురేందర్ రెడ్డి, త్వరలో పవన్ తో తీయబోయే మూవీ తో ఇటు బాబాయితో కూడా భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: