రూట్ మార్చేస్తానంటున్న వెంకటేష్..!

Divya
దగ్గుబాటి వెంకటేష్.. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు చిన్న కుమారుడు వెంకటేష్. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే , వెంకటేష్ బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసాడు అని. అది కూడా 1971 వ సంవత్సరంలో వచ్చిన ప్రేమనగర్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలో కి ప్రవేశం చేశాడు ఇక తర్వాత 1986 సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన "కలియుగ పాండవులు" సినిమా ద్వారా కథానాయకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు ను కూడా అందుకోవడం విశేషం.


ఇక 1986 సంవత్సరం నుండి ఇప్పటివరకు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు వెంకటేష్. వెంకటేష్ కేవలం సినిమాలలో హీరోగా మాత్రమే కాదు,  బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని టీవీ ప్రకటనలు కూడా పనిచేశాడు. వెంకటేష్ మొదట ఫ్యామిలీ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత మాస్ హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించాడు. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే , మరో పక్క బిజినెస్ చూసుకుంటూ రెండు చేతులు బాగానే సంపాదిస్తున్నాడు. ఇక ఇప్పుడు నారప్ప సినిమాతో  మళ్లీ హీరో గా మనముందుకు వచ్చాడు వెంకటేష్. నిన్న అనగా 20 జూలై 2021 వేదికగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం, పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పవచ్చు.

అంతేకాదు ఈ చిత్రం రీమేక్ కు  సేమ్ టు సేమ్ చేశారని, ఇందులో ఎటువంటి మార్పులు ,చేర్పులు చేయలేదని, వెంకటేష్ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని, మొదటి షో తో నే నెగిటివ్ రిజల్ట్ ను చవి చూసింది ఈ సినిమా. ఇకపోతే వెంకటేష్ f3  సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.త్వరలోనే  ఈ సినిమా షూటింగ్ లో బిజీ కాబోతున్నాడు. అయితే నారప్ప సినిమా ఇచ్చిన రిజల్ట్ చూసి, వెంకటేష్ హీరోగా వద్దనుకుని, ఇక మామ పాత్ర, తండ్రి పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆయన తీసే తరువాత చిత్రంలో తండ్రి పాత్రను లేక మామ పాత్రను చేయడానికి సిద్ధమవుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: