తెలుగు పరిశ్రమ ప్రముఖ ఎడిటర్ లలో మార్తాండ్ కె వెంకటేష్ ఒకరు. ఈయన ఈమధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అందులో భాగంగా మొదట నేను కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'అల్లరి ప్రేమికుడు' సినిమాకు ఎడిటర్ గా పని చేశాను అని చెప్పగా మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది అని యాంకర్ అడిగాడు. దానికి బదులుగా నేను కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన 'కూలి నెంబర్ 1' సినిమాకు అసిస్టెంట్ గా పని చేశాను. ఆ సమయంలో రాఘవేంద్ర రావు నన్ను పిలిచి సినిమా ఎలా అనిపించింది అని అడిగాడు. దానికి నేను సినిమా బాగానే ఉంది కానీ హీరో క్యారెక్టరైజేషన్ నాకు నచ్చలేదు. హీరోయిన్ కి మత్తు మందు కలిపిన పాలు ఇచ్చి మోసం చేయడం హీరోయిజం ఎలా అవుతుంది సార్ అని అడిగాను దానికి ఆయన నన్ను ఎప్పుడూ ఇలా సూటిగానే మాట్లాడు అంటూ ప్రశంసించాడు.
ఆ తర్వాత 'అల్లరి ప్రేమికుడు' సినిమా తో పాటు వరుసగా దాదాపు పది సినిమాల వరకు అవకాశాలు ఇచ్చాడు. మరియు మీరు ఆంధ్రావాలా సినిమా చూసి సెకండ్ బాగాలేదు సినిమా వర్కౌట్ అవ్వదు అని నిర్మొహమాటంగా చెప్పారు అంట నిజమేనా..?అని అడగగా అవును అందులో ఎన్టీఆర్ గెటప్ నాకు నచ్చలేదు అని చెప్పాడు. మరియు పూరి జగన్నాథ్ సూపర్ సినిమాను చూపించి ఎలా ఉంది సినిమా అని అడిగాడు..? దానికి నేను నాకు నచ్చలేదు అని చెప్పేసాను. ఎందుకు నచ్చలేదు మూడు లక్షలు పెట్టి సినిమాకోసం బండి తీసుకొచ్చాం, 30 లక్షలు పెట్టి చేజింగ్ సీన్లు తీశాం అయినా నీకు నచ్చలేదా అని అడిగాడు, దానికి నేను మీరు మూడు లక్షలు పెట్టి బండి కొన్న విషయం మీకు తెలుస్తుంది కానీ బయట జనాలకు తెలియదు సార్ , మీరు 30 లక్షలు పెట్టి చేజింగ్ సీన్లు తీసిన హీరో హెల్మెట్ పెట్టుకుని ఉంటే అది 'డుపే' చేశాడు అని అనుకుంటారు అని సమాధానం ఇచ్చినట్లు మార్తాండ్ కె వెంకటేష్ తెలిపారు.