బాలీవుడ్ భామ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా గత రెండు రోజుల కింద అరెస్టు అయిన సంగతి తెలిసిందే. రాజుకుంద్రా అరెస్ట్ కావడంతో అటు బాలీవుడు తో పాటు ... దేశంలోనూ ఒక్కసారిగా అలజడి మొదలైంది. శృంగార వీడియోలు నిర్మించి వాటిని వివిధ యాప్స్‌ల్లో అప్ లోడ్ చేస్తున్నడన్న ఆరోపణల తరుణంలో మహరాష్ట్రకు చెందిన పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలతోనే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశామని మహారాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. అయితే.. రాజ్‌కుంద్రా అరెస్ట్ అనంతరం కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అధిపతిగా ముందుకు వచ్చిన కుంద్రా.. ఆ తర్వాత బెట్టింగ్ ఆరోపణలతో అతడి ప్రతిష్ట మసకబారింది. ఎన్నో వివాదాలతో సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ నుంచి పాతాళానికి పడిపోయాడు. ఆశ్లీల చిత్రాలతో మరింత దిగజారిపోయాడు. ప్రస్తుతం ఆశ్లీల చిత్రాలతో వచ్చే అతని రోజువారీ సంపాదన.. అందరిని షాక్‌కు గురి చేసేలా చేస్తోంది. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో రాజ్ కుంద్రా బ్యాంకు అకౌంట్స్ డీటెయిల్స్ బయటపడ్డాయి.
దాని ద్వారా అతడు రోజుకు 7 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నట్లు తేలింది. హాట్ హిట్ మూవీస్ సంస్థ నుంచి అతడి అకౌంట్లోకి ప్రతి రోజు లక్షల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే... మొదట్లో వీరి సంపాదన 3 నుంచి 4 లక్షలు మాత్రమే ఉండేదని కూడా తేలింది. అంతే కాదు ఈ డబ్బును ఎప్పటికప్పుడు తన బ్యాంకు ఖాతా బదిలీ చేసుకునేవారు. ఇటీవలే నివేదికల ప్రకారం రాజ్ కుంద్రా తన సోదరుడు ప్రదీప్ బక్షి యాజమాన్యంలోని యూకేకు చెందిన కెన్రిన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి.. హాట్ హిట్ యాప్‌ను అమ్మారు. అయితే కుంద్రా మాత్రం ముంబై నుండి కార్యకలాపాలను నియంత్రిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ముందు.. ముందు ఎలాంటి షాకింగ్ నిజాలు బయట పడతాయో చూడాలి.