తమ సినిమాల కోసం హీరోలు ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. సినిమా భాగా రావాలని మంచి విజయం సాధించాలని కష్ట పడుతుంటారు. సినిమా కోసం డ్యాన్స్ లు చేయడం వల్ల ప్రమాదాలు ఏమీ జరగవు కానీ స్టంట్స్ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ఎంతటి ప్రమాదం బారిన అయినా పడవచ్చు. కానీ కొంత మంది హీరోలు తామే స్టంట్స్ చేసేందుకు రెడీ అవుతుంటారు. తాజాగా తమిళ హీరో విశాల్ కూడా అలాంటి రిస్కే చేసి ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో విశాల్ 31 అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సొంతంగా స్టంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా అయితే సినిమా హీరోలు స్టంట్స్ కోసం డూప్ లను పెట్టుకుంటారు. కానీ ఈ సినిమా కోసం తానే స్టార్ట్ చేయాలని విశాల్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సీన్ చేసిన సమయంలో విశాల్ ఇటీవలే ఓ సారి గాయాలపాలయ్యారు. ముఖానికి కొన్ని మరియు చేతులకు కొన్ని గాయాలు అయ్యాయి. కాగా తాజాగా మరోసారి విశాల్ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదులో ప్రస్తుతం విశాల్ 31 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ జరుగుతున్న సంధర్బంలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రిస్తున్నారు.
అయితే ఓ స్టంట్ చేస్తుండగా విశాల్ గోడను గట్టిగా ఢీ కొట్టి పడిపోయారు. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.దాంతో విశాల్ వెన్నుముకకు తీవ్రమైన గాయం తగిలినట్టు తెలుస్తోంది. దాంతో విశాల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గతంలో కూడా ఒకసారి...మళ్లీ ఇప్పుడు ఇలా ప్రమాదం జరిగినప్పటికీ విశాల్ మాత్రం తానే సొంతంగా స్టంట్స్ చేస్తానని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాపై విశాల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఎంతటి రిస్క్ చేసేందుకైనా వెనకాడటం లేదు.