మల్టీ స్టారర్ సినిమా బడ్జెట్ మించిందట..!

shami
యువ హీరోలు ఇద్దరు కలిసి చేసిన ఓ క్రేజీ మూవీ బడ్జెట్ లిమిట్ దాటేసిందని ఇండస్ట్రీ టాక్. ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుందన్న విషయాన్ని వెల్లడించిన ఆ చిత్రయూనిట్ ఫైనల్ లెక్కలు చూస్తే షూటింగ్ కోసమే అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేశారని తేలిందత. ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది దానికి ఇంకాస్త బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది.

ఇంతకీ బడ్జెట్ లిమిట్ దాటేసిన ఆ సినిమా ఏది అంటే శర్వానంద్, సిద్ధార్థ్ చేస్తున్న మల్టీస్టారర్ మూవీ మహా సముద్రం అని అంటున్నారు. ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన సెకండ్ సినిమాగా ఇది చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర భారీగా నిర్మిస్తున్నారట. సబ్జెక్ట్ బాగుండటంతో పాటుగా అజయ్ భూపతి మీద నమ్మకంతో బడ్జెట్ దాటినా నో ప్రాబ్లం అనేశారట నిర్మాత అనీల్ సుంకర.

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి మహా సముద్రం సినిమా మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ లు కలిసి చేయడం కూడా క్రేజీగా మారింది. బొమ్మరిల్లు సిద్ధార్థ్ చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి రోల్ చేస్తున్నారు. ఈ సినిమా సిద్ధార్థ్ కు మంచి పేరు తెస్తుందని అంటున్నారు. ఇక మంచి సినిమాలు చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ మహా సముద్రంతో ఆ కోరిక తీర్చుకుంటాడని బలంగా చెబుతున్నారు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. శర్వానంద్ ఈ సినిమాతో పాటుగా మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. శ్రీకార్తిక్ డైరక్షన్ లో ఒకే ఒక జీవితం సినిమా చేస్తున్న శర్వా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: