కార్తీకదీపం సీరియల్ కి శుభం కార్డు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్?
అయితే కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం 1000 ఎపిసోడ్ లు దాటిపోయింది. అయినప్పటికీ ఇంకా అటు బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం బోర్ కొట్టడం లేదు. ప్రస్తుతం బుల్లితెర చరిత్రలోనే ఏ సీరియల్ కు సాధ్యం కాని రీతిలో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది కార్తీకదీపం సీరియల్. కొత్తగా ఎన్నో సీరియల్స్ వస్తున్నప్పటికీ అటు కార్తీకదీపం సీరియల్ రేటింగ్ మాత్రం మ్యాచ్ చేయలేకపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక మరికొన్ని రోజుల్లో కార్తీకదీపం సీరియల్ కి శుభం కార్డు పడబోతుంది అన్న వార్త వైరల్ గా మారిపోయింది. దీంతో ఇక ఈ సీరియల్ అభిమానులందరూ ఆందోళనలో మునిగిపోయారు.
అయితే తాజాగా ఇక ఈ సీరియల్కు శుభం కార్డు పడటం పై క్లారిటీ ఇచ్చారు ఇక ఈ సీరియల్ డైరెక్టర్ రాజేంద్ర. రేటింగ్ బాగున్నంతవరకు ఈ సీరియల్ యధావిధిగా కొనసాగుతుంది అంటు ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇక మరికొన్ని రోజుల్లో ఈ సీరియల్కు శుభం కార్డు పడబోతుంది అని వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని అటు సీరియల్ అభిమానులు అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న కార్తీకదీపం సీరియల్ అటు 1100 ఎపిసోడ్ లకు దగ్గర అవుతున్నప్పటికీ అటు బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం బోర్ కొట్టడం లేదు. అదే రీతిలో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటు దూసుకు పోతుంది ఈ సీరియల్.