KGF చాప్టర్ 2 క్లైమాక్స్.. సీట్లలో ఎవరు కూర్చోరట..!

shami
ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో వచ్చిన కె.జి.ఎఫ్ సెన్సేషనల్ హిట్ సాధించింది. బాషతో సంబంధం లేకుండా కె.జి.ఎఫ్ నేషనల్ వైడ్ సంచలనాలు సృష్టించింది. హీరో యశ్ కు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ ఆడియెన్స్ అందరిని ఫిదా అయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా అంచనాలను కొనసాగిస్తూ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వస్తుంది. టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన ప్రశాంత్ నీల్ ఈసారి అంతకుమించి అనిపించేలా చేస్తాడని మాత్రం అర్ధమవుతుంది.

టీజర్ తో శాంపిల్ చూపించి అంచనాలు పెంచిన ప్రశాంత్ నీల్ అసలు బొమ్మ వెండితెర మీద చూపిస్తానని ఛీలెంజ్ చేస్తున్నాడు. ఇక కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఆడియెన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా దానికి మించి అనేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ అలా ఇలా ఉండదని ఊరిస్తున్నాడు. సినిమా మొత్తం ఒక లెక్క అయితే క్లైమాక్స్ ఒక లెక్క అని అంటున్నారు. అంతేకాదు కె.జి.ఎఫ్ 2 క్లైమాక్స్ లో ఆడియెన్స్ ఎవరు సీట్లలో కూర్చోరని గ్యారెంటీ గా చెబుతున్నారు కెమెరా మెన్.

సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని.. సినిమా పక్కా మళ్లీ సంచలనాలు సృష్టిస్తుందని చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ 2 క్లైమాక్స్ ను చాలా బాగా తెరకెక్కించారని.. సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ అదిరిపోతుందని అంటున్నారు కెమెరా మెన్. చూస్తుంటే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పార్ట్ 1 సృష్టించిన అన్ని రికార్డులను కొల్లగొట్టి పాన్ ఇండియా లెవల్లో బీభత్సం సృష్టించేలా ఉందని చెప్పొచ్చు. జూలై 16న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడ్డది. కె.జి.ఎఫ్ 2 రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా మేకర్స్ ఎనౌన్స్ చేయలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఇయర్ ఎండింగ్ లోనే కె.జి.ఎఫ్ 2 రిలీజ్ ఉంటుందని అంటున్నారు. క్రిస్ మస్ రేసులో సినిమాను దించాలని అనుకుంటున్నారు నిర్మాతలు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: