వెంకటేష్‌కు అప్పట్లో ఆ ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ నిజమేనా ?
ప్రేమించుకుందాం రా - కలిసుందాం రా - జయం మనదేరా సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇదే సెంటిమెంట్ తో వచ్చిన ప్రేమతో రా సినిమా డిజాస్టర్ కూడా అయింది. ఇదిలా ఉంటే వెంకటేష్ కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో పుకార్లు వినిపించాయి. వెంకటేష్ ఒకానొక సమయంలో మీనాతో ఎక్కువగా సినిమాలు చేశాడు. వెంకటేష్ - మీనా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత వెంకటేష్ ది - దివంగత హీరోయిన్ సౌందర్య ది కూడా హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. అప్పట్లో వీరు స్నేహంగా ఉండడం తో వీరి మధ్య కూడా ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే వాస్తవంగా వెంకటేష్ ఎప్పుడు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకున్నాడు అన్నది మాత్రం వాస్తవం.