సినీ ప్రేక్షకులకు వినాయక చవితి వరకు నిరీక్షణ తప్పదా?
ఎప్పుడు వరుసగా సినిమాలు విడుదల అవుతూ ఉంటే ప్రేక్షకులతో కళకళలాడి పోయే థియేటర్ లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయే పరిస్థితి వచ్చింది. ఇక అటు థియేటర్ లు తెరుచుకోకపోవడంతో సినీ ప్రేక్షకులు అందరికి నిరాశే మిగులుతుంది. అయితే ఇటీవలే ఏపీలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడం కారణంగా థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి. ఇక ఇటీవలే కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు తెలుసుకోవచ్చు అంటూ ఇటీవలే ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. దీంతో థియేటర్లు తెరుచుకుంటాయి అని అటు సినీ ప్రేక్షకులు అందరూ భావించారు.
కానీ అటు ప్రభుత్వం థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు తెరవడానికి మాత్రం మరికొంత సమయం పట్టేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అయితే కరోనా వైరస్ కారణంగా అటు సినిమా షూటింగులు కూడా వాయిదా పడ్డాయి ఈ క్రమంలోనే అన్ని సినిమా లు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్నాయి ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా తక్కువే ఇలా విడుదలకు తగినన్ని సినిమాలు లేకపోవడం.. అంతేకాకుండా ప్రభుత్వం కేవలం 50 శాతం సీటింగ్ సమస్యతోనే థియేటర్ లో ఓపెన్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం.. మరోవైపు టిక్కెట్ల ధరల పై కూడా కొత్త జీవో తీసుకు రావడంతో ఇక ఇప్పట్లో థియేటర్లు తెరవాలని అటు నిర్వాహకులు భావించడం లేదట. ప్రభుత్వంతో సినిమా హాల్ నిర్వాహకులు జరిపే చర్చలు ఓ కొలిక్కి వస్తే వినాయక చవితి తర్వాత ఇక బొమ్మ పడే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తోంది.