తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో మెగా స్టార్ తరహాలో... తమిళంలోనూ హీరో విజయ్ కు మంచి పేరుంది. అలాగే ఇక సినిమాలు కూడా హిట్ లిస్ట్ లోనే ఉన్నాయి. హీరో విజయ్ అని ముద్దుగా ఇళయ దళపతి అంటారు. అయితే ఇలాంటి ఇ స్టార్ హీరో విజయ్ కి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. హీరో విజయ్ కి... మద్రాస్ ఉన్నత న్యాయస్థానం లో షాక్ తగిలింది.
2012 వ సంవత్సరంలో... హీరో విజయ్ కొనుక్కున్న... రోల్స్ రాయిస్ అనే కొత్త మోడల్ కారుకు పన్ను రిలాక్సేషన్... ఇవ్వాలంటూ... ఆయన వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. అక్కడితో ఆగకుండా... ఆయన వేసిన పన్ను మినహాయింపు పిటిషన్ ను మద్రాస్ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇంగ్లాండ్ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న నా కారుకు కచ్చితంగా... ఇన్ కం టాక్స్ కట్టాల్సిందే నని స్పష్టం చేశారు హై కోర్ట్ న్యాయమూర్తి ఎం సుబ్రహ్మణ్యం.
అంతే కాకుండా పెద్ద హీరోలు... ఇన్ కం టాక్స్ కట్టేందుకు చాలా వెనుకాడుగు తున్నారు అని తీవ్ర స్థాయిలో మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడితో ఆగకుండా పిటిషను పేరుతో... విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను ఇళయ దళపతి విజయ్ కి అక్షరాల లక్ష రూపాయలు జరిమానా విధించింది కోర్ట్. విజయ్ కట్టే జరిమానాను కరోనా రిలీఫ్ ఫండ్ కోసం ఉపయోగించాలని హైకోర్టు న్యాయమూర్తి ఎన్ సుబ్రహ్మణ్యం తీర్పునిచ్చారు. కాగా హీరో విజయ్ ఈ ఖరీదైన కారును ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో 'బీస్ట్'' అనే సినిమాను ఏం చేస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా అలరించనున్న ది.