కృష్ణంరాజుకి ఆ బిరుదు ఎలా వచ్చిందంటే..?
.ఆయన నటించిన జీవన తరంగాలు, కృష్ణవేణి, సతీ సావిత్రి, మన ఊరి పాండవులు, భక్త కన్నప్ప లాంటి పలు చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.కృష్ణం రాజు నటనకు ఆయన అభిమానులు రెబల్ స్టార్ అనే బిరుదును ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు అదే బిరుదు మన ప్రభాస్ కి కూడా వచ్చింది. కృష్ణం రాజుకు కొడుకులు లేరు, కూతుళ్లు ఉండడం వలన ఆయనకు వారసులు లేరు. అయినాగానీ తన సోదరుడి కొడుకు అయిన ప్రభాస్ ను తన సినీ జీవితానికి వారసుడిగా ప్రకటించారు.
పెదనాన్నలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ప్రభాస్ లో ఉన్నాయి. ప్రభాస్ అందరు అభిమానించే గొప్ప హీరో అవుతాడని కృష్ణం రాజు పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చేవారు. అసలు కృష్ణం రాజుకు రెబల్ స్టార్ అనే బిరుదు ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు.ఆయన సినిమాల్లో నటించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కళ్ళు ఎర్ర చేయడం, నొసలు ఎగురవేయడం, ముఖం కోపంగా పెట్టడం, గంబీరంగా మాట్లాడం లాంటివి అన్నీ చూసి అభిమానులు ఆయనకు రెబల్ స్టార్ అని పేరు పెట్టారు. సినిమాల్లో కృష్ణం రాజు నవ్వడం చాలా తక్కువ.. సీరియస్ గా హుందతనంగా ఉంటారు. ఒకవేళ ఆయన ముఖంలో చిరునవ్వు కనిపిస్తే ఆటోమాటిక్ గా సినిమా చూసే వాళ్ళు కూడా నవ్వు ముఖం పెడతారు. సినిమాల్లో రాణించిన కృష్ణం రాజు రాజకీయాల్లో కూడా రాణించారు. కానీ ఇప్పుడు రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు.