ఫ్యాన్స్ కోసం త్యాగం..!

NAGARJUNA NAKKA
మన హీరోలు కొత్తకొత్తగా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులను ఎంజాయ్ మూడ్ లో ఉంచేలా జాగ్రత్త పడుతున్నారు. అందుకు తగ్గ సిినిమాలనే సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ మన్మథుడులాగానే కనిపిస్తున్న నాగార్జున.. వరుసగా థ్రిల్లర్ మూవీస్ చేస్తున్నాడు. ఇటీవల 'వైల్డ్‌డాగ్'తో ఓకే అనిపించుకున్న నాగ్, మళ్లీ యాక్షన్‌ థ్రిల్లర్‌లోనే నటిస్తున్నాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో 'రా' ఏజెంట్‌గా నటిస్తున్నాడు నాగ్. కుటుంబ కథా చిత్రాలతో విజయం సాధించడంలో ముందుంటాడు వెంకటేశ్. అయితే ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసే వెంకటేశ్, ఇప్పుడీ ఫ్యామిలీ స్టోరీస్‌ని థ్రిల్లర్స్‌తో మిక్స్ చేస్తున్నాడు. ఫ్యామిలీ థ్రిల్లర్స్‌ అనే కొత్త జానర్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఇదే జానర్‌లో 'దృశ్యం' సినిమా చేసి సక్సెస్ సాధించాడు వెంకీ. వెంకటేశ్ ఇప్పుడు ఫ్యామిలీ థ్రిల్లర్ 'దృశ్యం'కి సీక్వెల్ చేస్తున్నాడు. మళయాళంలో ఒరిజినల్ 'దృశ్యం' సీరిస్‌ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే 'దృశ్యం2' సినిమా వస్తోంది. ఈ మూవీ సమ్మర్‌లోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో ఆడియన్స్‌ రొటీన్‌ స్టోరీస్‌ని పెద్దగా ఎంకరేజ్ చేయడం లేదు. సీనియర్ హీరోలు బాక్సాఫీస్‌ని ఖుషీ చెయ్యడానికి థ్రిల్లర్స్‌ని ప్రిపేర్ చేస్తున్నారు.
ఇక రాజశేఖర్‌ 'గరుడవేగ' తర్వాత వరుసగా థ్రిల్లర్ జానర్లోనే సినిమాలు చేస్తున్నాడు. సక్సెస్‌ని కంటిన్యూ చేసేందుకు యాక్షన్‌ థ్రిల్లర్స్‌లో నటిస్తున్నాడు. ప్రశాంత్‌ వర్మతో 'కల్కి' చేశాడు. ఇప్పుడు మల్లికార్జున్ దర్శకత్వంలో చేస్తోన్న 'శేఖర్',  వెంకటేశ్ మహా డైరెక్షన్‌లో వస్తోన్న 'మర్మాణువు' సినిమాలు థ్రిల్లర్‌ జానర్‌లోనే వస్తున్నాయి.
మాస్ మూవీస్‌తో హంగామా చేసే రవితేజ ఇప్పుడో యాక్షన్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ 'రాక్షసుడు' సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి హిట్‌ ఇచ్చిన రమేశ్ వర్మ ఇప్పుడు మాస్ మహారాజ్‌తో 'ఖిలాడి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ డ్యుయల్‌ రోల్ ప్లే చేస్తున్నాడని, సైకో కిల్లర్‌గా నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఆ విధంగా ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతారో.. లేక విమర్శలు గుప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: