బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్ కీరవాణి కాదా ... ??

GVK Writings
దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన అత్యద్భుత చిత్రరాజాలైన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు భారీ సక్సెస్ లు అందుకుని తెలుగు సినిమా రేంజ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లాయి. ఇక ఎంతో భారీ ఎత్తున తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా సినిమాలు హీరో ప్రభాస్, దర్శకుడు రాజమౌళి సహా యూనిట్ మొత్తానికి ఎంతో బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఈ మూవీస్ అనంతరం ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్, మార్కెట్ దక్కించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ కొనసాగుతున్నారు.
దర్శకుడు రాజమౌళి వీటిని ఒకదానిని మించేలా మరొకటి ఎంతో గ్రాండియర్స్ గా తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా ఇందులోని భారీ విజువల్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ వంటివి ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మించిన బాహుబలి సిరీస్ సినిమాలకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందించగా స్వరవాణి కీరవాణి సంగీతం అందించారు. ఇక ఈ రెండు సినిమాల్లోని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా పేరు దక్కించుకున్నాయి. అయితే మొదట ఈ సినిమాకి సంబంధించి సంగీత దర్శకుడిగా ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ ని తీసుకోనున్నారు అంటూ అప్పట్లో పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి.
భారీ సినిమాలు కావడంతో రాజమౌళి, రెహమాన్ ని తీసుకుంటున్నారని ప్రచారం జరగడంతో అవేవి నిజం కాదని, మొదటి నుండి తన సినిమాలకు వర్క్ చేస్తున్న తన సోదరుడు కీరవాణి తోనే ఈ సినిమాలకు కూడా పని చేయనున్నట్లు ఆ తరువాత యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఆ విధంగా బాహుబలి మూవీస్ కి రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు అనే వార్త అప్పట్లో వైరల్ అయింది .... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: