యంగ్ హీరో సరసన నటించనున్న వంటలక్క..

Divya
కార్తీకదీపం సీరియల్ తో బాగా పాపులర్ సంపాదించుకున్న నటి వంటలక్క (ప్రేమి విశ్వనాథ్). ఈమే ఈ సీరియల్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్లి పోయింది. ఇక అంతే కాకుండా , అన్ని సీరియల్ కంటే ఈ సీరియల్ కి ఎక్కువ టీ ఆర్ పీ రేటింగ్ ను సాధించడం కూడా విశేషం. అయితే ఇప్పుడు ఈమె ఒక యంగ్ స్టార్ హీరో సరసన నటించబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో వినికిడి. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.

కార్తీకదీపం సీరియల్ దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి మంచి టీ ఆర్ పీ రేటింగ్ ను సాధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక రెండు నెలల నుంచి ఈ సీరియల్ కాస్త వెనకబడిందని తెలుస్తోంది. ఇక ఈ సీరియల్ ద్వారా ఈమెకు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు సీరియల్ లో నటించిన నటీమనులలో ఇంతటి అభిమానం పొందిన ఏకైక నటిగా వంటలక్క గుర్తింపు తెచ్చుకుంది అని చెప్పవచ్చు.
ఈమె ఒకవైపు బుల్లితెరపై నటిస్తుండగానే.. మరోవైపు షాపింగ్ మాల్స్  ఓపెనింగ్స్ వంటి వాటికి కూడా వెళుతుందట. ఇలా పాపులరైన వంటలక్కకు  ఇప్పుడు వెండితెరపై కూడా నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. కానీ ఈమె అప్పుడు ఏ సినిమాలు మాత్రం ఒప్పుకోలేదట. అయితే ఇప్పుడు తాజాగా ఒక సినిమాకు ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. రామ్ పోతినేని, కృతి శెట్టి హీరోయిన్ గా  లింగుస్వామి డైరెక్షన్ లో  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒకరోల్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ లింగుస్వామి వంటలక్కతో తన పాత్ర ఇలా ఉంటుందని వివరించారని తెలిసింది. త్వరలో ఈ విషయంపై అధికార ప్రకటన వెలువడుతుందని వినికిడి. ఏది ఏమైనా బుల్లితెర నటులు తమ నటనతో ప్రేక్షకుల ఆదరణ పొంది, వెండితెర వైపు బాటలు వేస్తున్నారని  చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: