మా ఎన్నికలు.. ప్రకాష్ రాజ్ Vs నరేష్..?

Anilkumar
సినీ ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకి చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి.ఇప్పటికే అధ్యక్ష బరిలో ఐదుగురు సభ్యులు దిగారు.అయితే వీరిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్,మంచు విష్ణు ల మధ్య గట్టి పోటీ నెలకొంది.ఒకవైపు ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ మద్ధతుగా నిలుస్తుంటే.. మరోవైపు మంచు విష్ణు కి సీనియర్ నరేష్ వెననుండి సపోర్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ బరిలో మరో సీనియర్ నటుడు సివిఎల్ నరసింహ రావ్ సైతం ఉండటంతో తెలంగాణ వాదం మరింత బలపడుతోంది.దీంతో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

ఇదిలా ఉంటె ఈ రచ్చను తగ్గించడానికి ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు నటుడు మురళి మోహన్ కామెంట్ చేసారు.పెద్దలందరం కూర్చొని దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.ఇక మా ఎన్నికలు ప్రకటించే వరకు తాను కానీ, తన ఫ్యానల్ సభ్యులు కానీ మీడియా ముందుకు  రాబోమని చెప్పిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నిన్న ప్రకాష్ రాజ్ .. ఎన్నికలు ఎప్పుడూ? అని తనదైన శైలిలో ట్వీట్ చేసాడు.అయితే ఇప్పుడు ఆ ట్వీట్ కి సమాధానంగా సీనియర్ నటుడు నరేష్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

"మార్చిన నిబంధనలు,ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్ లో మా ఎన్నికలు నిర్వహిస్తామని ఇది వరకే చెప్పాము.. మెయిల్ కూడా పంపించాము.మళ్ళీ మీరు ఇలా అడుగుతున్నారు...ఇది ఎలా ఉందంటే, నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్ లో దూకుతాను అన్నట్లు ఉందని..కౌంటర్ వేశాడు.అంతేకాదు దీంతో పాటూ మెయిల్ పంపిన డాక్యుమెంట్లు కూడా జత చేసాడు.దీంతో ఈ ట్వీట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.సెప్టెంబర్ నెలలో జరగాల్సిన ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఇంతలా రచ్చ జరుగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మరి ముందు ముందు ఇవి ఎలాంటి పరిణామాలకు దారి తిస్తాయో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: